శ్రీ నాగేశ్వరస్వామి కొలువై ఉన్న అతి ప్రాచీన ఆలయం గురించి తెలుసా?

0
2064

గంగా పార్వతి సమేత శ్రీ నాగేశ్వరస్వామి కొలువై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీన ఆలయం అని చెబుతారు. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

NageshwaraSwamyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామంలో గంగా పార్వతి సమేత శ్రీ నాగేశ్వరస్వామి వారు కొలువై ఉన్నారు. అయితే పూర్వం ఈ గ్రామం తామ్రపూరి గా పిలువబడింది. క్రీ.శ. 1213 లో కాకతీయ గణపతి మహారాజు ఈ తామ్రపురిని జయసేనాపతికి దానం చేసినట్లు ఒక శాసనం ద్వారా తెలియుచున్నది. ఇక్కడ పల్లవ రాజుల ద్వారా శైవం బాగా బలపడినట్లు తెలియుచున్నది.

NageshwaraSwamyతూర్పు చాళుక్య భీముడు పొన్నూరులో శ్రీ భీమేశ్వరాలయమును నిర్మించి శైవానికి విశిష్టతను చేకూర్చాడు. క్రీ.శ. 14 వ శతాబ్దంలో ఈ ఉరి గ్రామ పెద్దలుగా ఉన్న ముర్తాన్న, కంటెన్నా అనే అన్నదమ్ములు ఈ ఆలయం నిర్మించినట్లు ఈ ఆలయంలో ఉన్న ఒక శాసనం ద్వారా తెలుస్తుంది.

NageshwaraSwamyఇక ఆలయ విషయానికి వస్తే, ఆలయ ప్రాగణం ఐదు అంతస్థుల గాలిగోపురం ఈ చుట్టూ పక్కల ప్రాంతంలో ఉన్న అనేక ఆలయ గోపురాలన్నిటిలోకి ఎత్తైనదిగా కనబడుతుంది. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉండి గర్భాలయం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలుగా నిర్మించబడి ఉన్నది.

NageshwaraSwamyగర్భాలయంలో శ్రీ నాగేశ్వరుడు ప్రతిష్ట కావించబడి ఉన్నాడు. అంతరాలయం ఎడమ భాగాన పార్వతీదేవి, కుడిభాగాన గంగామల్లేశ్వరుడు, మండపమునందు నందీశ్వరుడు ప్రతిష్టించబడి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక మండపంలో నవగ్రహమూర్తులు కొలువై ఉన్నారు. ఈ నాగేశ్వరాలయానికి బయట, రాజగోపురానికి కుడివైపున ఉన్న ఒక మంటపంలో సుమారు ఐదు అడుగుల ఎత్తు, ఆరు అడుగుల పొడవు ఉన్న నందీశ్వరుని విగ్రహం ఉంది.

NageshwaraSwamyఈ మండపం మొత్తం ఎర్ర ఇసుక రాతి నిర్మాణం, మంటపంలో ఉన్న నందివిగ్రహం కూడా ఎర్రరాతితో చెక్కిన ఏకశిలా శిల్పమే. ఈ నందీశ్వరుని విగ్రహం వీపు మీద, మెడ దగ్గర, నుదుటి మీద చూడముచ్చటగా ఉండే నగిషీలు, జాలరి పనులు అధ్బుతంగా చెక్కబడినాయి. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.

NageshwaraSwamy

 

SHARE