మన దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో జ్వాలాముఖి ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలోని అమ్మవారిని జ్వాలాముఖి అని పిలుస్తారు. ఇక్కడి విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక చిన్న గుంటలో ఉన్న రంద్రం నుండి మంట అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ అమ్మవారు ఎలా వెలిశారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా నుండి దక్షిణంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో జ్వాలాముఖి అనే ఊరిలో ఈ జ్వాలాముఖి ఆలయం ఉంది. మెయిన్ రోడ్డులో ఒక చిన్న కొండమీద ఈ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం కలదు. అయితే 51 శక్తిపీఠాలలో ఈ జ్వాలాముఖి ఒకటి. సతీదేవి యొక్క నాలుక పడిన ప్రదేశంగా భక్తులు భావిస్తారు.అమ్మవారు జ్వాలారూపంలో ఉండటం వల్ల జ్వాలాదేవి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఇక్కడ కొలువై ఉన్న శివుడిని ఉన్నత భైరవుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో తొమ్మిది జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాయి. అయితే సుమారు 50 మెట్లు ఎక్కితే అక్కడ ఉన్న ఆలయంలో విద్యేశ్వరి దేవి దర్శనమిస్తుంది. ఇక్కడ 40 అడుగుల ఎత్తుగల సువర్ణ త్రిశూలం ఉంది. జ్వాలాముఖిలో శివుడు అంబికేశ్వర మందిరంలో కొలువై ఉన్నాడు.
జ్వాలాముఖి ఆలయంలో జ్వాలలు ఎలాంటి ఇంధన సరఫరా లేకుండా వెలుగుతుండటానికి కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించినా శాస్త్రవేత్తలు సైతం విఫలం అయ్యారు. అయితే ఈ ఆలయంలో క్రింద ఉన్న అరకు కింద చిన్న గుంటవలె ఉంటుంది. ఈ గుంటలో ఒక ప్రక్కన చిన్న రంద్రంలో నుంచి అరచేతి మందం ఉన్న జ్వాలా నిరంతరం వస్తూనే ఉంటుంది. నిరంతరం వచ్చే ఈ జ్వాలా సతీదేవి యొక్క నాలిక యొక్క రూపమేనని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది.
ఈ ఆలయంలో రెండు నుంచి 10 ఏళ్లలోపు కన్యాలైన ఆడపిల్లలను దేవి స్వరూపంగా తలచి పూజలు చేస్తారు. ఏవిధంగా కన్యలను పూజించడం వలన దారిద్య్రం తొలుగుతుందని, దుఃఖ, శత్రునాశనం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.