This Poem Describing The Destruction Caused By Humans To Mother Earth Will Make Us Think Twice

Written By Aranya Krishna

భూమినడుగు చెబుతుంది
తన ఉమ్మనీరులో క్రిమిసంహారకాలు కూరిన
దుర్మార్గ శాస్త్రవేత్తెవ్వరో

ఆకాశాన్నడుగు చెబుతుంది
ఓజోన్ వలువని ఊడబెరికిన
సాంకేతిక దుశ్శాసనుడెవ్వరో

అడవినడుగు చెబుతుంది
చెట్లను నరికి భూసారాన్ని హత్యచేసే
ఆర్ధిక ఉగ్రవాది ఎవరో

1 Destruction By Humansకొండనడుగు చెబుతుంది
తనని చిత్తుకాగితాలుగా చింపి ఫ్లోరింగ్ గా నేల కిందేసి తొక్కిన
ధూర్త నాగరీకుడెవ్వరో

నదినడుగు చెబుతుంది
నీటి గుండెలో గునపం దించుతూ ఇసుకని
దోచుకెళ్ళిన దొంగెవరో

2 Destruction By Humansచరిత్రనడుగు చెబుతుంది
అభివృద్ధికోసం వ్యాపారమైనా
ఆక్రమణ కోసం యుద్ధ విధ్వంసమైనా
ప్రకృతిని కొరుక్కుతినే చీడపురుగు మనిషేనని!

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR