ఇంటిలో పూజ గది ఎటువైపు ఉండాలో తెలుసా ?

0
1897

కొత్తగా ఇల్లు కట్టేముందు వాస్తు పండితుణ్ణి పిలిపించి ఇంటికి వాస్తు ప్లాన్ చేయిస్తారు. ఇందులో ముఖ్యంగా చూడవలసింది పూజ గది ఎక్కడ ఉంటే మంచిది అనే విషయం. మరి ఇంట్లో ఏ దిక్కున పూజగది ఉండాలో పరిశీలిద్దాం.

పూజ గదిఇంట్లో పూజలు చేసేవారు ఈశాన్య దిక్కులో ఉండే గదిలో కాని, వాయువ్యంలోని గదుల్లో కాని పూజలు చేయాలి. అలాగే తూర్పు ఉత్తర దిశలో ఉన్న గదులలో చేయొచ్చు. పూజ చేసేవారి ముఖం ఉత్తరం వైపుకు ఎదురుగా కాని, తూర్పు కు ఎదురుగా కాని ఉండాలి.

పూజలో నియమాలు :

పూజ గదిదీపారాధనకు వేరుశనగ నూనేను వాడితే  అరిష్టం. ఆవు నెయ్యి తో చేస్తే ఐశ్వర్యము, ఆరోగ్యము, సంతోషం కలుగుతాయి. నువ్వుల నూనె తో చేస్తే దుష్ట శక్తి భాధలు, శత్రు బాధలు తోలిగిపోతాయి. ఆముదము తో చేస్తే ఎకగ్రత ,కీర్తి ప్రతిష్టలు, స్నేహితులను  పొందుతారు. ఆవు నెయ్యి, పిప్పి నూనె, వేప నూనె కలిపి దీపారాధన ఆరోగ్యానికి మంచిది.

పూజ గదిదీపారాధనకు వెండి కుందులు, పంచ లోహ కుందులు మంచివి. మట్టి కుందులు కూడా పరవాలేదు. స్టీలు కుందులు మాత్రం వాడకూడదు. పూజ చేసేటప్పుడు ఎర్రని దుస్తులు ధరించటం మంచిది. పూజను విగ్నేశ్వర పూజతో ప్రారభించి, ఆంజనేయ పూజతో ఆపటం ఆచారం. పూజ చేస్తూ మాట్లాడటం, నవ్వటం చేయకూడదు.