శ్రీ జగన్నాథస్వామి కొలువై ఉన్న పూరి క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ ఆలయాన్ని పోలి ఉండే మరొక ఆలయం ఉన్నది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని, కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో శ్రీ జగన్నాథస్వామి ఆలయం ఉంది. ఒరిస్సా రాష్ట్రంలోని పూరి క్షేత్రం లాగే ఈ ఆలయం నిర్మించారు. ఈ జగన్నాథస్వామి దేవాలయం దక్షిణ పూరిగా జగత్ ప్రసిది చెందింది. ఈ ఆలయంలో బలరామ సుభద్రాసమేత శ్రీ జగన్నాథస్వామి వార్లు కొలువై ఉన్నారు.
ఆనాడు దట్టమైన అడవితో బోయలు నివసించే ఈ ప్రదేశాన్ని వ్యధాలి అనే వారని కాలక్రమేణా అదే వడాలిగ మారిందని ఇక్కడి స్థానికులు చెబుతారు. ఈ జగనాథస్వామికి అంతులేని భూసంపద కలదు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయానికి 1200 ఎకరాల సుక్షేత్ర భూములను హైదరాబాద్ నవాబు స్వామికి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తుంది.
స్థల పురాణానికి వెళితే, 400 సంవత్సరాల పూర్వం ప్రకాశం జిల్లా కర్రపాలేనికి చెందిన అవధూత అనబడే పురుషోత్తమానంద స్వామి వడలిలోని జగనాథస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. వైష్ణవ భక్తుడైన ఈ అవధూత స్వామికి పూరి జగన్నాథుడు కలలో కనిపించి ఈ ప్రాంతంలో తనకు ఒక గుడికట్టించమని ఆదేశించారు. అది మహా ప్రసాదంగా భావించిన అవధూత ఆలయ నిర్మాణం కోసం వెతుకుతున్న సందర్భంలో సన్నపాడు చేరుకొని ఆ ప్రదేశం ఆలయ నిర్మాణానానికి సరైందని భావించి స్థానికులతో అవధూత ఆ స్తలం ఎవరిదని కనుకోవడానికి నిజం నవాబుల అనుమతి కోసం బయలుదేరి వెళుతూ విజయవాడ వద్ద కృష్ణ నదిలో సన్నపాడు గ్రామస్థులతో స్నానం చేస్తున్న అవధూత ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు.
అప్పుడు గ్రామస్థులు ఆశ్చర్యపోయి ఆ ప్రాంతంలో వెతికి వెతికి అలసిపోయి నిరాశతో గ్రామానికి వెళ్లిపోయారు. కృష్ణానదిలో అదృశ్యమైన అవదూతస్వామి తన శక్తి ప్రభావముచే హైదరాబాద్ నిజం నవాబు అంతఃపురంలో ప్రత్యేక్షమైనాడు. అవదూతను చూసి నవాబు ఆశ్చర్యపోయి, ఎవరు నీవు నీకు ఇక్కడ పని ఏమిటి వచ్చిన కారణం ఏంటో తెలుపుము అని అనగా, అవధూత జగనాధస్వామి దేవాలయం నిర్మాణం జరపాలనుకున్నామని, అందుకు కావాల్సిన స్థలాన్ని తమరు ఇవ్వాలని కొరకు.
అందుకు ఒప్పుకున్న నవాబు, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీరు ఎంత దూరం తిరగగలిగితే అంత స్థలం దేవాలయానికి దానంగా ఇస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు అవధూత స్వామి ఆనందంతో ఇప్పుడు నిర్మించిన వడాలి లోని ప్రాంతంలో 1200 ఎకరాల పరిధిలో తిరిగి ఆ భూమిని నవాబు ద్వారా దేవాలయానికి అప్పగించారు.
ఇలా పూరి ఆలయాన్ని పోలి ఉండే ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎప్పుడు అధికంగా ఉంటుంది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.