కొత్త దంపతులు కొంగుముడి వేసుకొని స్వామివారిని దర్శించుకునే ఆలయం

0
6084

శివుడి ని సాంబశివుడిగా ఇక్కడ కొలుస్తారు. ఈ మహా పుణ్యక్షేత్రంలో శ్రీ గంగ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లు కొలువుదీరి ఉన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు ఈ స్వామిని దర్శించుకొని , సేవించిన అనుగ్రహంతోనే సంతానవంతుడయ్యాడని అందువల్లనే తన కుమారునకు సదాశివరాయలు అనే పేరు పెట్టాడని సాతల పురాణం చెబుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణానికి సంబంధించిన విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

samba shivuduఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కి 8 కీ.మీ. దూరంలో శ్రీ గంగ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం కలదు. ఈ క్షేత్రంలో బారసాల, నామకరణము, అన్నప్రాసన, పుట్టు వెంట్రుకలు, చెవులు కొట్టుట వంటి బాల్య సంస్కార ప్రక్రియలకు ప్రసిద్ధి పొందినది. శివాలయమైనను వివాహ, ఉపనయనము మొదలైన శుభకార్యములను కూడా ఇచట చేసుకొంటారు.

samba shivuduఈ ఆలయంలో కొత్త దంపతులు కొంగుముడి వేసుకొని స్వామివారిని దర్శించుకొని దేవాలయ ఆవరణలో ఉన్న శ్రీ సుబ్రమణ్యేశ్వరుని, శ్రీ వినాయకుని సేవించుకుంటారు. నాగదేవతలకు, నవగ్రహ లకు పూజలు చేస్తారు. ఆ సమయంలో కొత్త దంపతుల మనసులో ఉన్న మధురమైన కోరిక ఏమిటో ఆ మల్లేశ్వరునికి, ఇద్దరు బిడ్డలా తల్లి అయినా ఆ భ్రమరాంబదేవి కీ తెలుసు. అందుకే ఆ నవదంపతులు అమ్మానాన్నలే, తమ పాపలతో మల్లన్న దర్శనానికి వచ్చి ఈ స్వామి సమక్షంలోనే తమ బిడ్డలకు నామ సంస్కరణాది కార్యాలు చేస్తారు. ఇది ఈ క్షేత్రం మహిమగా భక్తులు నమ్ముతారు. ఈ క్షేత్రంలో సుబ్రమణ్యస్వామి మహత్యం కూడా ఎన్నదగినదని అగస్త్య మహర్షి గుర్తించాడు.

samba shivuduఈ ప్రాంతానికి సిద్ధయోగ సహజమనే పేరు కూడా ఉంది. అయితే పరమేశ్వరుడు ఒకసారి సంచారం చేస్తూ మంగళగిరికి, గుంటూరు మధ్య గల సుందరవనాన్ని చూసి పరవశించి ఆ వనంలో కొంతకాలం నివసించాలన్న కోరికతో అక్కడే ఉండిపోయాడు. మహర్షుల సేవలనందుకుంటూ, భక్తులను కాపాడుతూ ఉన్నాడు. ఎంతో మంది సిద్ద యోగులు పరమేశ్వరుడిని సేవించి తపస్సు చేసిన ప్రాంతం కనుక దీనికి సిద్ధయోగ సమాజమన్న పేరు వచ్చింది. దానిని రుజువు చేస్తూ నేటికీ స్వామివారికి ప్రభలు కట్టి, మేళతాళాలతో, నృత్య గీతాలతో స్వామివారిని ప్రసన్నం చేసుకుంటారు.

samba shivuduఅయితే పరమేశ్వరుడు ఈవిధంగా ఇక్కడే ఉండిపోవడంతో భ్రమరాంబ మల్లికార్జునుని జాడను కనుక్కురమ్మని తన చెలికత్తెలైన జయ విజయలను పంపింది. వారు ఇక్కడికి చేరుకొని శివుడికి ఈ సంగతి తెలిపారు. అప్పుడు మల్లికార్జునుడు వెంటనే శ్రీశైలం చేరుకున్నాడు. కానీ కాకాని పై గల ప్రీతితో స్వయంభువుగా అక్కడ వెలిసాడు.

samba shivuduప్రాచీనమైన ఈ ఆలయం ఉత్తరముఖంగా మూడు భాగాలుగా ఉంది. ఈ ఆలయంలోని గర్భగుడిలో శ్రీ మల్లేశ్వరస్వామి, ఆయనకు ఎడమభాగాన భ్రమరాంబ అమ్మవారు, కుడిభాగాన భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వరుడూ, మండపంలో నందీశ్వరుడు మనకు దర్శనమిస్తారు. ఇచట ఉన్న శ్రీ మల్లేశ్వరునకు సాంబశివుడు అనే మరొక పేరు కలదు. దేవాలయ తూర్పు భాగాన భరద్వాజ మహామునిచే నిర్మింబడిన బావి ఒకటి కలదు. మహర్షి పుంగవులు సమస్త తిర్దాల నుండి పవిత్ర జలాన్ని సేకరించి ఈ బావిలో ఉంచారు. భరద్వాజ ముని యజ్ఞద్రవ్యాన్ని ఈ బావిలో వదిలినందున దీనికి యజ్ఞాలబావి అని పేరు వచ్చినట్లుగా చెబుతారు.

samba shivuduఇలా ఎంతో ప్రాముఖ్యత కల ఈ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకుంటారు.

7 shivudini sambashivudiga piliche sri bramaramba sametha sri malleswaraswami alayam