భక్తులు పిల్లలకి అక్షరాబ్యాసం చేయించడానికి ఎక్కవుగా వచ్చే అద్భుత ఆలయం

0
3425

సరస్వతీదేవి కొలువై ఉన్న ప్రముఖ దేవాలయంలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గా ఈ ఆలయం విరాజిల్లుతుంది. ఒక ఎత్తైన కొండపైనా వెలసిన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరి ఈ క్షేత్రం ఎక్కడ ఉంది? ఇక్కడి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

saraswatideviతెలంగాణ రాష్త్రం, మెదక్ జిల్లా, వర్గల్ మండలంలో సరస్వతీదేవి కొలువై ఉన్న విద్యాధరి క్షేత్రం ఉంది. కొండపైన వెలసిన ఈ దేవాలయంలో సరస్వతి దేవి ఆలయంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, శనీశ్వరుని దేవాలయం కూడా ఉన్నాయి. ఇక్కడికి ఎక్కువగా భక్తులు పిల్లలకి అక్షరాబ్యాసం చేయించడానికి వస్తుంటారు.

saraswatideviఈ దేవాలయంలో నిత్యం భక్తులకు ఉచితముగా అన్నదానం జరుగుతుంది. ఈ ఆలయ ఆవరణలోనే ఒక వేద పాఠశాల కూడా ఉంది. ఇక్కడ రోజు అనేకమంది విద్యార్థులు వేదాలని నేర్చుకుంటుంటారు. ఈ దేవాలయ పరిధిలో సుమారు 300 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించబడుతుంది.

saraswatideviఈ దేవాలయం కంచి శంకర మఠం ద్వారా నిర్వహింపబడుతున్నది. ఇంకా ఈ ఆలయ ప్రాంగణ నిర్మాణం సరస్వతీ ఆరాధకుడైన యాయవరం చంద్రశేఖర శర్మ ఆలోచన ఫలితంగా నిర్మితమైనదని చెబుతారు.

saraswatideviఈ వర్గల్ విద్యాధరి పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం సరస్వతి అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి రోజున ప్రత్యేక పూజలతో పాటు విశేష కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా దసరా సందర్బంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు.

saraswatidevi