శివలింగం ఇంటిలో ఉంటె రోజు అభిషేకం చేయాలా ?

0
1795

కొంతమంది భక్తులు తరచు శివాలయానికి వెళ్తుంటారు. అభిషేకాలు చేస్తూ ఉంటారు. శివలింగాన్ని ఇంట్లోనే పూజించుకోవాలని మనసులో ఉన్నా ఎవరో చెప్పింది విని ఓ అనుమానంతో ఇంట్లో లింగాన్ని పెట్టుకోరు. ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు అంటా, ఒకవేళ వుంటే రోజూ అభిషేకాలు చేయాలి. లేకుంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయి అనే అపోహ వుంది చాలా మందికి. శివలింగం గురించి ఎవరుపడితే వారు ఎలా చెపుతారు. చెబితే శివమహాపురాణం చెప్పాలి.

Shivalingamశివలింగం గురించి శివ మహాపురాణం ఏం చెపుతుందంటే, బొటనవేలు అంత శివ లింగాన్ని ప్రతి ఇంట్లో వుంచుకోవాలి. శివాలయం లేని ప్రాంతంలో స్మశానం కూడా వుండకూడదు. ఎందుకంటే ఉగ్ర భూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయి. శివాలయంలో శివలింగం తప్పక వుంటుంది. అంటే, స్మశానంలో కూడా శివలింగం వుంటుంది. స్మశానంలోనే వుంటే మీ ఇంట్లో వుండకూడదా.. ఎవరుపడితే వారు ఏదేదో చెబుతుంటారు.

Shivalingamఎందుకంటే వాళ్ల అర్థజ్ఞానంతో, వాళ్లు వృద్ధిలోకి రారు ఇంకొకర్ని వృద్ధిలోకి రానివ్వరు. ప్రతి ఇంట్లో బొటనవేలు అంత శివలింగాన్ని తప్పక వుంచుకోవచ్చు. ప్రతిరోజూ మంచినీళ్లతో అభిషేకం చేయాలి. లేదంటే ఒక కొత్త వస్త్రంలో నీళ్లను వడకట్టి ఆ నీళ్లతో చేయాలి. ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితి వున్నా, చేయకున్నా ఫర్వాలేదు. అభిషేకం చేసేటపుడు మహామృత్యుంజయ మంత్రం చదవవచ్చు లేదంటే నమశ్శివాయ నమశ్శివాయ అనుకుంటూ అభిషేకం చేసినా మంచిదే.