వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతిప్రాచీన శివమందిరం

0
4995

త్రిమూర్తులలో ఒకడైన శివుడికి దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయంలో శివుడిని దర్శించుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన ఫలితం కలుగుతుందని భక్తుల ప్రగాడం నమ్మకం. ఇక్కడ శివుడిని కాలసంహమూర్తి అని పిలవడం ఒక విశేషం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి సంబంధించిన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

shivudu తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్, పురానాపూల్ లో మూసీనది ఒడ్డున, జూ పార్క్ కి వెళ్ళేదారిలో కాలసంహమూర్తి మందిరం ఉంది. దీనినే శివ మందిరం అని పిలుస్తారు. ఇది అతి పురాతనమైన ఆలయమని, ఈ ఆలయానికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉందని తెలియుచున్నది. ఈ ఆలయంలోని స్వామివారు స్వయంభువుగా వెలసినట్లుగా చెబుతారు.

shivuduకార్తీకమాసంలో ఈ స్వామిని ఆరాదిస్తే కోర్కెలు తిరడమే కాకుండా మరణాన్ని జయించే శక్తిని కూడా అనుగ్రహస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ పరమేశ్వరుడిని కాలసంహమూర్తి, కామ సంహమూర్తి గా భక్తులు కొలుస్తున్నారు. ఈ ఆలయ దర్శనం సర్వశుభాలను కలిగించి, సర్వదారిద్య్ర బాధలను తొలగించి, సర్వ సంపత్తులను కలిగిస్తాడని భక్తుల విశ్వాసం.

shivuduఈ ఆలయంలో స్వామికి శివునికి ప్రతినిత్యం అభిషేకాలు, సహస్రనామార్చనతో పాటు, విశేష పూజలు, అర్చనలు జరుగుతాయి. ఇక్కడ కార్తీకమాసంలో భక్తులు మహన్యాసపూర్వక మహారుద్రాభిషేకం, బిల్వార్చనలు, ఉభయసంధ్యలలో దీపారాధనలు చేస్తారు. ఇలా చేసిన వారికీ విశేష పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు.

shivuduఆలయంలో శివునితో పాటు వినాయకుడు, సుబ్రమణ్యస్వామి, ఆంజనేయుడు, నవగ్రహాలు మొదలగు దేవతామూర్తులు ప్రతిష్ఠితులై ఉన్నారు. ఇచట ఉన్న వినాయకుడిని సేవిస్తే అనుకున్న కోరికలు సిద్దించి, అన్నింటా విజయం సాధిస్తారని, సుబ్రమణ్యస్వామిని సేవిస్తే అవివాహితులకు వివాహం, సంతానం లేని దంపతులకు సంతానం, సర్పదోషం కలవారికి దోష నివారణ కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

shivuduఈ ఆలయంలో నిత్యపూజలతో పాటు, వివిధ పండుగ పర్వదినాలలో విశేష పూజలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.