స్వయంభువుగా వెలసిన కట్ట మైసమ్మ తల్లి ఆలయ చరిత్ర

0
10794

కట్ట మైసమ్మ మహాలక్ష్మి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడ వెలసిన అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి అవతారంగా భక్తులు భావిస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి సంబందించిన మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

maisammaతెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్, బేగంపేటలో ఉన్న లోయర్ ట్యాంక్ బండ్ వద్ద శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం ఉంది. ఈమె ఒక గ్రామదేవత. ఇది ఒక పురాతన ఆలయం. నిజాం పరిపాలన కాలంలో ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలసినట్లు పెద్దలు చెబుతారు.

maisammaఅయితే 1907 లో వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇక్కడ గంగపూజ చేయడంతో అవి ఆగిపోయాయంట. అంతేకాకుండా ఇప్పటివరకు అటువంటి ఘటనలు పునరావృత్తం కాకపోవడానికి అమ్మవారి మహిమేనని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయాన్ని1996 లో దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది.

maisammaఆలయ పురాణానికి వస్తే, సుమారు 93 సంవత్సరాల క్రితం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఒకరోజు రాత్రి కాంట్రాక్టర్ కలలో అమ్మవారు కనిపించి నేను కట్టమైసమ్మను. మీ సంరక్షణ కోసమే ఇక్కడే వెలుస్తున్నాను. ఇక్కడ నాకు ఒక ఆలయాన్ని నిర్మించండి అని చెప్పి అదృశ్యమైంది. అప్పుడు కాంట్రాక్టర్ వెంటనే అక్కడ మైసమ్మ అమ్మవారికీ చిన్నాదేవాలయం నిర్మించాడు. ఆనాటి మైసమ్మ కాలక్రమేణా కలవేరేటి మైసమ్మగా, కట్టమైసమ్మగా, గ్రామదేవతగా భక్తులచే కొలువబడుతుంది.

maisammaఅమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా 1991 లో సుభాష్ ముదిరాజు గారు ముఖమండపాన్ని, గర్భాలయాన్ని కట్టించారు. గతంలో ఉన్న శ్రీచక్రానికి ఎదురుగా అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. అప్పటినుండి అమ్మవారు కట్టమైసమ్మ మహాలక్ష్మీదేవిగా పిలువబడుతూ దినదినాభివృద్ధి చెంది ప్రఖ్యాతి గాంచింది.

maisammaప్రస్తుతం కట్టమైసమ్మ దేవాలయం సర్వాంగసుందరంగా నిర్మించబడినది. ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆషాఢమాసంలో చివరి ఆదివారం ఇక్కడ బోనాలు పండుగ నిర్వహిస్తారు. ప్రతినిత్యం ఈ ఆలయానికి ఎప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇక్కడ వెలసిన అమ్మవారిని దర్శించడానికి జంటనగరాలనుండి కాకా పక్క రాష్ట్రాల నుండి కూడా అనేక మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని పూజిస్తున్నారు.

maisamma