Shivudu puli charmam darinchatam venaka unna rahasyam

0
6826

శివుడికి, లింగ రూపంలోనే ఎక్కువగా ఆలయాలు మన దేశంలో ఉన్నాయి. అయితే శివుడి యొక్క రూపంలో ఒక్కోదానికి ఒక్కో అర్ధం అనేది ఉంది. అయితే అసలు పులిచర్మం అయన ధరించడానికి గల కారణం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.1 Shivudu Tiger Skin

శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. పరమశివుడు పులి చర్మాన్ని ధరించి, పులి చర్మాన్ని ఆసనంగా చేసుకుని ధ్యాన మగ్ధుడై కూర్చుని ఉంటాడు. ఆయన పులిచర్మాన్నే ఎందుకు ధరించాడు? పులి చర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అనే దానికి శివపురాణంలో ఒక పురాణ కథ ఉన్నది.2 Shivudu Tiger Skin

పరమ శివుడు సర్వసంగ పరిత్యాగి. స్వామి దిగంబరుడై అరణ్యాలలో శ్మశానాలలో తిరుగాడుతూ ఉండే వాడు. ఒక రోజు ఆయన సంచరిస్తూ ఉండగా మునికాంతలు, పరమేశ్వరుని సౌందర్యానికీ, ఆయన తేజస్సుకీ కళ్ళు తిప్పుకోలేకపోయారు. వారిలో ఆయనను చూడాలన్న కాంక్ష పెరగసాగింది. ఆయననే తలుచుకుంటూ ఇంటి పనులు కూడా సరిగా చేసేవారు కాదు.3 Shivudu Tiger Skinతమ భార్యలలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణమేమిటని వెతికిన మునులకు పరమేశ్వరుని చూడగానే సమాధానం దొరికింది. వారు ఆ దిగంబరుడు సదాశివుడని మరచి ఆయనను సంహరించడానికి పథకం వేసారు. ప్రతి రోజూ స్వామి నడిచే దారిలో ఒక గుంతను తవ్వారు. స్వామి ఆ గుంత సమీపానికి రాగనే అందులో నుంచి వారి తపశ్శక్తితో ఒక పులిని సృష్టించి శివుని మీదికి ఉసిగొల్పారు. మహాదేవుడు సునాయాసంగా ఆ పులిని సంహరించడాడు. మనుల చర్య వెనుక వారి ఉద్దేశ్యం అర్థం చేసుకుని ఆ పులితోలుని కప్పుకున్నాడు.4 Shivudu Tiger Skinఅది చూసిన మునులు, రోజూ వారి ఆశ్రమానికి వస్తున్నది సాధారణ వ్యక్తి కాదని, దేవుడని తెలుసుకొని, శివుడి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటారు. అప్పటి నుండి శివుడు ఆ పులిచర్మంను ధరించడం జరిగిందని పురాణాలూ చెప్పుతున్నాయి.
5 Shivudu Tiger Skin