గరుడ పురాణం చదవకూడదా? ఇంట్లో పెట్టుకోకూడదా?

ప్రపంచంలో ఉన్న ప్రాచీన మతాల్లో హిందూ మతం ఒకటి. దీన్నే సనాతన ధర్మం అని కూడా అంటారు. దీని ప్రకారం.. బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణుమూర్తి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. శివుడు లయకారుడు. ధర్మం, కర్మ, పాపాలకు సంబంధించిన పరిజ్ఞానం అంతటినీ విష్ణుమూర్తి తన వాహనమైన గరుడికి బోధించాడు. అదే గరుడ పురాణం. స్వర్గానికి ఎవరెళ్తారు, నరకానికి ఎవరెళ్తారు అని గరుడ పక్షి విష్ణు మూర్తిని ప్రశ్నించగా.. ఎవరైతే మంచి పనులకు దూరంగా, ఎప్పుడు చెడ్డపనులే చేస్తుంటారో వారు తప్పక నరకానికి వెళ్తారని విష్ణువు చెప్పాడు.

garuda puranaఅయితే చాలామంది గరుడపురాణం పట్ల పూర్తిగా వ్యతిరేక భావనలు కలిగి ఉంటారు. గరుడ పురాణం చదవటం వల్ల అనేక కష్టాలు వస్తాయని, ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలని భావిస్తుంటారు.

గరుడ పురాణం కేవలం మనుషులకు విధించే శిక్షలను తెలియజేస్తుందని, మనుషులు చేసిన పాపాలకు మరణాంతరం ఎలాంటి బాధలను అనుభవించాలనే విషయాల గురించి ఉంటుందని అందుకోసమే ఈ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని చాలా మంది చెబుతుంటారు. అదేవిధంగా నాగ దేవతలను పూజించే వారు గరుడ పురాణాన్ని చదవటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతారు.

garuda puranaఅయితే నిజంగానే గరుడపురాణం చదవటం వల్ల ఈ విధమైన ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారా. నిజంగానే గరుడ పురాణం పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకోకూడదన్న సందేహాలు చాలా మందిలో కలుగుతుంటాయి. మరి గరుడ పురాణం పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

garuda puranaఅన్ని పురాణాలు మాదిరిగానే గరుడ పురాణం ఒకటి. అయితే మనుషులకు విధించే శిక్షలు ఇందులో ఉంటాయి కాబట్టి దీనిని ఇంట్లో పెట్టకూడదని భావిస్తారు. నిజానికి ఈ పుస్తకాన్ని ఎలాంటి అనుమానాలు లేకుండా నిస్సంకోచంగా ఇంటిలో ఉంచుకోవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.

ఎందుకంటే గరుడ పురాణం అనేది కేవలం శిక్షలను మాత్రమే తెలియజేస్తుంది కానీ ఆ పుస్తకం ఒక దుష్టశక్తుల నిలయం కాదు. మనకు కావాల్సిన ఎంతో విలువైన సమాచారాన్ని ఈ గరుడ పురాణం అందిస్తుంది.

ravanaమనం పాపాలు చేయటం వల్ల ఎలాంటి శిక్షలు పడతాయో ముందుగా తెలియజేస్తూ మనలను అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి విలువైన పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల జ్ఞానం కలుగుతుంది తప్ప ఎలాంటి కీడు జరగదని ఈ పుస్తకాన్ని నిస్సంకోచంగా ఇంట్లో పెట్టుకోవచ్చని చెప్పవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR