సద్గురువు శ్రీ గురు రాఘవేంద్రస్వామి జీవసమాధి పొందిన స్థలం ఎక్కడ ?

0
15980

భక్త ప్రహ్లదుడు కలియుగం లో శ్రీ రాఘవేంద్ర స్వామిగా జన్మించాడని కొన్ని పురాణాలూ చెబుతున్నాయి. ఇంకా శ్రీ కృష్ణ దేవరాయల మతగురువైన శ్రీ వ్యాసరాయలవారే రాఘవేంద్రస్వామి అని కొందరి భక్తుల నమ్మకం. మరి కలియుగ దేవుడైన ఈ స్వామి వెలసిన మంత్రాలయం విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

manthralayamఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కర్నూలు జిల్లా, కర్నూలు లోని మంత్రాలయం రైల్వే స్టేషన్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో పరమ పవిత్రమైన తుంగభద్రానది ఒడ్డున వెలసిన మహిమాలయమే ఈ మంత్రాలయం. ఈ క్షేత్రంలోనే సద్గురువు శ్రీ గురు రాఘవేంద్రస్వామి జీవసమాధి పొందారు. అయన సమాధిని ‘రాఘవేంద్ర బృందావనం’ అని పిలుస్తారు.

manthralayamఇక పురాణం విషయానికి వస్తే, శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో తిమ్మబట్టు అనే గొప్ప పండితుడు, వీణ విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మరొక కుమారుడిని ప్రసాదించమని నియమ నిష్ఠలతో వేంకటేశ్వరస్వామిని ప్రార్ధించగా క్రీ.శ. 1598 సంవత్సరంలో పాల్గుణ శుద్ధ సప్తమి నాడు భువనగిరి లో వేంకటనాధుడు అనే ఒక కుమారుడు జన్మించాడు. ఆయనే పెరిగి పెద్దవాడై శ్రీ రాఘవేంద్రస్వామిగా ప్రసిద్ధి పొందారు.

manthralayamఈయన ఎంతో మహిమగల వాడు ఎంతోమంది భక్తుల కోర్కెలను తీర్చి తన మహత్యాన్ని చూపించారు. ఈయన అన్ని విద్యలలో పాండిత్యం సంపాదించి, గురుకృపకు పాత్రులై 1621 లో పీఠాధిపత్యం స్వీకరించారు.

manthralayamజమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి మంచాల దేవతగా ఇక్కడ అవతిరించిందని ఆమె పేరుమీద ఈ గ్రామానికి మంచాల అనే పేరు సిరపడిందని, ఈ మంచాల గ్రామమే నేడు మంత్రాలయ క్షేత్రంగా పిలువబడుతుందని భక్తులు నమ్ముతారు.

manthralayamఇక ఈ స్వామి 47 గ్రంథాలను విరచించి, యొగింద్ర తీర్థులకు తమ ఆశ్రమాన్ని అందచేసి, 72 ఏటా క్రీ.శ. 1670 లో శ్రావణ బహుళ విదియ గురువారం నాడు మంత్రాలయంలో సజీవంగా బృందావనస్థులాయ్యారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన బృందావనం అనే పేరు పెట్టారు. ఇప్పటికి స్వామివారు అందులో జీవించి ఉన్నారని భక్తుల నమ్మకం.

manthralayamఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయనాడు ఆరాధన ఉత్సవం జరుపబడుతుంది. ఆ స్వామి దర్శించిన భక్తుల కోరికలను తీర్చడమే కాకుండా,వారికీ మంచి ఆరోగ్యాన్ని, సిరిసంపదలను ఇస్తూ వర ప్రదాత, ముగా, చెవిటి, గుడ్డి వారందరికీ స్వస్థత చేకూర్చే ఆరోగ్య ప్రదాత శ్రీ రాఘవేంద్రస్వాములవారు.

7 mahimalaya sri ragavendraswami mantralayam