Srirangam, Tirupathi taruvatha ekkuvaga darshinche aalayam edi?

0
3452

శ్రీ మహావిష్ణువు వెలసిన మూడు ముఖ్యమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటని చెబుతారు. ఇక్కడే శ్రీమహావిష్ణువు లక్ష్మి దేవిని వివాహం చేసుకున్నాడని స్థల పురాణం. మరి వైష్ణవులు అతి పవిత్రంగా భావించే ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో గల విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. tirupathiతమిళనాడు రాష్ట్రం, కుంభకోణంలో గల ఆది కుంభేశ్వరస్వామి దేవాలయానికి ఎదురుగా శ్రీ సారంగపాణి దేవాలయం ఉంది. ఈ సారంగపాణి దేవాలయం చాలా ప్రాచీన ఆలయంగా చెబుతారు. ఈ ఆలయం దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతారు. అయితే శ్రీరంగం, తిరుపతి తరువాత వైష్ణవులు ఎక్కువగా దర్శించేది ఈ ఆలయమే అని చెబుతారు. tirupathiఈ ఆలయంలో విష్ణమూర్తి ముద్హన్ అనే అవతారంలో ఇక్కడికి వచ్చి లక్ష్మి దేవిని వివాహం చేసుకున్నాడని పురాణాలూ చెబుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని శ్రీ కమలా లక్ష్మీదేవి అని పిలుస్తారు. ఈ గుడికి రెండు ప్రధాన ద్వారాలున్నాయి. దక్షిణ ద్వారాన్ని దక్షిణాయన కాలంలోనూ, ఉత్తర ద్వారాన్ని ఉత్తరాయణ కాలంలోనూ ఆలయ ప్రవేశం కల్పిస్తారు. ఆలయానికి ఉత్తర భాగంలో కొములవల్లి అమ్మవారి గోపురం ఉంది. tirupathiమహారాష్ట్ర రాజు షాహాజి అత్యంత వైభవంగా ఈ ఆలయాన్ని నిర్మించాడని ఇక 15 వ శతాబ్దంలో నాయకరాజులు ఈ ఆలయాన్ని పునరుద్దించారని తెలుస్తుంది. ఇక ఈ ఆలయం మధ్యలో ఉండే గోపురం దేవాలయ సముదాయంలో కెల్లా అతి ప్రాచీనమైంది. దీని గోపురం 146 అడుగులు, 44 మీటర్ల ఎత్తు, 12 అంతస్తులు కలిగి ఉంటుంది. tirupathiఇక ఈ ఆలయ ఆవరణలోనే స్వర్ణ తామరకొలను అనే పుష్కారిని ఉంది. దీనిని లక్ష్మి తీర్థం అని కూడా పిలుస్తారు. ఇక్కడి పూజలు ఇతర కార్యక్రమాలు పంచరాత్ర ఆగమాలు అనుసరించి జరుపబడతాయి. ఈ దేవాలయ విమానం సభా మంటప రథం పన్నెండు రాతిస్థంబాల మీద సుందర విలసిత శిల్పాలతో ముచ్చటగా ఉంటాయి. tirupathiదేవాలయానికి అత్యంత రమణీయంగా చెక్కబడిన రెండు రథాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాడేందుకు ఒక వెండి రథం కూడా ఉంది. 6 srirangam thirupathi taruvatha ekkuvaga darshinche alayam edhiఈ ఆలయాన్ని వైష్ణవులు శ్రీ మహావిష్ణువు యొక్క అతి ముఖ్యమైన మూడు ఆలయాలలో ఇది ఒకటిగా చెబుతారు.7 srirangam thirupathi taruvatha ekkuvaga darshinche alayam edhi