సిరివెన్నెల సీతారామ శాస్త్రి…ఈయనకు 60 సంవత్సరాలు మీదకు వచ్చాయి కానీ అయన మనసు మాత్రం ఇంకా 16 సంవత్సరాల కుర్రాడి లాగా ఆలోచిస్తుంది. అందుకే… ఆలోచనలను అక్షరాలుగా మలిచి….ప్రేమికుల మధ్య వచ్చే విరహ గీతాన్ని “సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా…..మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున” అంటూ పదహారేళ్ళ ప్రేమికుడి లా మారిపోయి రాసేశారు.
ఇలా ఒక పాట రాయవలసి వచ్చిన ప్రతిసారి మన సిరివెన్నెల గారు….తాను వయస్సుని తగ్గించుకుని….రాసిన పాటలు మనమంతా పదే..పదే… విని పాడుకునేలా ఉంటాయి. అందుకు చక్కటి ఉదాహరణ ఈ మధ్య వచ్చిన “సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా” పాట.
ఇలా ఈ ఒక్క పాట అనే కాదు….ఈ మధ్యకాలం లో సిరి వెన్నెల గారు రాసిన కొన్ని పాటలు…అయన పదహారేళ్ళ యువకుడు అని చెప్పడానికి నేను ఏమాత్రం ఆలోచించాను.
మరి ఆ పాటలు ఏవో ఒకసారి చూసేద్దాం….!
1. సామజవరగమన
2. అణగణగనగా – అరవింద సమెత
3. ఊహలు ఊరేగే గాలంతా – సమ్మోహనం
4. గాలి వాలుగా – అజ్ఞ్యాతవాసి
5. ఏదో జరుగుతోంది – ఫిదా
6. హంసారో – చెలి
7. చలి గాలి చూద్దు – జెంటిల్మెన్
8. ఎం చెప్పాను – నేను శైలజ
9. ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో – కంచె
10. మెంటల్ మదిలో – ఓకే బంగారం