This Short Note About The Humble Nature Of JP Reddy Garu Shows Us What A True Artist He Was

0
244

Written By: Karthik Chatra

2004 సంవత్సరం నేను ఎప్పటికి మర్చిపోలేను…ఎక్కడో కాకినాడ పరిసర ప్రాంతాల్లో బాల నటుడిగా నాటకాలు వేసుకుంటూ ఉన్న నాకు హైదరాబాద్ నుంచి నాటకం లో వేషం ఉంది అని పిలుపు రాగానే పట్టరాని సంతోషం తో హైదరాబాద్ వెళ్ళాను….తీరా రెహార్సల్ రూమ్ కి వెళ్ళగానే చాలా పెద్ద షాక్ మొదటి సారి ఒక పెద్ద సినిమా నటుడిని దెగ్గిర నుంచి చూసాను అంతే కాదు నేను చేసే నాటకం లో ఆయన కూడా చేస్తున్నారు అని తెలిసింది మాటల్లో చెప్పలేని సంతోషం….ఆయనతో ఒకసారి మాట్లాడాలి అలాగే ఫోటో దిగి అందరికి చూపించుకోవాలి అనుకున్న కానీ మాట్లాడటానికి ఏదో తెలియని భయం మంచిగా మాట్లాడతారా… లేదా?? అని టెన్షన్…అపుడే పిలుపు ” రేయ్ బుడ్డోడా…..” అని జె.పీ అంకుల్ ……ఒక్క నిమషం షాక్ … ” సార్ నేను మీ సినిమాలు చూసాను” అంటూ తడబడుతూ ఏదో ఏదో మాట్లాడేస్తున్నా….నేను నీ గురించి చాలా విన్నాను అంటూ నా గురించి నేను వేసిన నాటకాలు గురించి మాట్లాడారు…అతి తక్కువ సమయం లో చాలా దెగ్గిర ఐయ్యారు రోజు ఆయన నేను ఒక కార్ లో రిహార్సల్స్ కు వెళ్ళటం కలిసి వేరే వేరే ఊరుల్లో నాటకాలు వేయటం అలా మాటల్లో చెప్పలేని ఎన్నో అనుభూతులు….తరువాత కొన్ని కారణాల వల్ల ఒక 8 సంవత్సరాలు ఆయనని కలవటం జరగలేదు ఒకసారి మళ్ళీ ” అలెగ్జాండర్ ” అని నాటకం కోసం కాకినాడ వస్తున్నారు అని తెలిసింది మళ్ళీ వెళ్ళాను గుర్తుపట్టరేమో “నేను” అని పరిచయం చేసుకుందాం అని వెళ్ళాను…. ఒక పక్క చానెల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ బిజీ గా ఉండి కూడా మైక్స్ వెనకాల ఉన్న నన్ను గుర్తుపట్టి ” రేయ్ బుడ్డోడా ” అని పిలిచి నన్ను దెగ్గిరకు తీసుకున్న క్షణాలు ఇప్పటికి మర్చిలోలేను… సమాజం లో చాలా మంది తమకు “కళ” పట్ల అపారమైన ప్రేమ ఉంది అంటూ మాటల్లో చెప్పేవల్లే గాని చేతల్లో చేసేవాళ్ళు చాలా అరుదు…కానీ ఒక పక్క సినిమాలలో రోజుకి లక్షలు సంపాదన ఉన్న సమయంలో కూడా తాను ప్రేమించిన నాటకరంగాన్ని వదిలిపెట్టకుండా “నాటకం బ్రతకాలి…. నా చివరి క్షణాలు దాకా నేను నాటకాలు వేస్తూనే ఉంటా ” అంటూ నట రాజుకి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన మాహ గొప్ప వ్యక్తి జయ ప్రకాష్ రెడ్డి గారి….. ఇలాంటి వాళ్ళే అసలైన కళ అమ్మ తల్లి ముద్దు బిడ్డలు…We Miss You Uncle 😢

SHARE