Black Tiger: The Unsung Hero
“చరిత్రలో సమాధి అయిన ప్రతి కథ మళ్ళీ ప్రాణం పోసుకోవాలి.”
ఇది శత్రువు ధరణి పై అస్తమించిన ఒక సూర్యుని కథ. ఆ సూర్యుడి పేరే రవీంద్ర కౌశిక్.
1962 లో ఇండియా-చైనా వార్,1965 లో ఇండియా-పాకిస్తాన్ వార్ తర్వాత అనుక్షణం శతృదేశాలపై నిఘా ఉంచేందుకు ఒక సంస్థ అవసరం ఏర్పడింది. అప్పటి ఇంటెలిజన్స్ విభాగం శతృదేశాలపై సమాచారం అందించడంలో ఘోరంగా విఫలమైంది. 1968 లో Research and Analyis Wing – RAW ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
చైనా-పాకిస్తాన్ ఇండియాను నాశనం చెయ్యడానికి కుట్రలు చేస్తున్న సమయం అది. అలాంటి సమయంలో పాకిస్తాన్ ఆర్మిలో చోటు సంపాదించుకొని, అత్యంత సీక్రెట్ సమాచారాన్ని మనకు చేరవేసే ఏజెంట్స్ కొరకు RAW అత్యంత సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టింది.
పాకిస్తాన్ పేరు చెప్పగానే యే ఒక్కడు ఏజెంట్గా చేరడానికి ముందుకు రావట్లేదు, వచ్చిన వారికి సరైన సమర్ద్యం ఉండట్లేదు. ఈ సమయంలో ఆ అధికారులు ఒక నాటకం చూడడానికి వెళ్లారు, ఆ నాటకం చైనా చేతిలో చిక్కిన ఒక భారతీయ ఆర్మీ ఆఫీసర్ కథ, ఆర్మీ ఆఫీసర్ గా అతను చేస్తున్న నటన అందరినీ కట్టిపడేసింది, ఇది నిజమేనేమో అనే స్తితిలోకి ప్రేక్షకులని తీసుకుపోయాడు ఆ నటుడు. నాటకం తరువాత RAW అధికారులు అతనికి రెండు దారులు పరిచారు. ఒక దారి అతని కల తెర పై నటించడం, ఇంకో దారి పూర్తిగా రంగు, రూపు, మాట, మతం, వేషం మార్చుకొని శత్రు భూమి పై నటించడం. అతను రెండో దారినే ఎంచుకున్నాడు.
రెండేళ్ళు కటోరమైన ఆర్మీ శిక్షతో పాటు ఉర్దూ నేర్చుకున్నాడు, పాకిస్తాన్ కల్చర్ని ఆవహించుకున్నాడు, ఆకరికి సుంతి కూడా చేసుకొని పూర్తిగా తెలిసిన వాళ్ళు కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. చివరికి 23 యేళ్ల వయసులో పాక్ గడ్డపై నబీ అహ్మెద్ షాకిర్ గా అడుగుపెట్టాడు. అక్కడ ఎవరికి అనుమానం రాకుండా కరాచీ యునివర్సిటిలో ఎల్‌ఎల్‌బి పూర్తి చేశాడు. తర్వాత పాక్ ఆర్మీ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాడు, పాకిస్తాన్ ఆర్మిలో ఒక భాగం అయ్యాడు. అక్కడే అమానత్ అనే అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నాడు, వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. అతను అంచల్ అంచల్ గా ఎదిగి పాక్ ఆర్మిలో మేజర్ అయ్యాడు. ముఖ్యంగా 1979-1983 మధ్య కాలంలో యెన్నో మారణహోమాలని ఆపగలిగాడు, పాక్ ఆర్మీ పన్నిన కుట్రలని ఇండియన్ అధికారులకి ఎప్పటికీ అప్పుడు సమాచారం చెరజేస్తూ ఉండేవాడు.
అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో, RAW అధికారులు ఇన్నాయత్ మసిహః అనే వ్యక్తిని పాక్ కి పంపించింది, అతను పాక్ ఆర్మీ చేతిలో చిక్కిపోయాడు, అతను ఆల్రెడీ అక్కడ పాక్ ఆర్మీ మేజర్ హోదాలో ఉన్న మన నబీ అహ్మెద్ షాకిర్ గురుంచి రహస్యం బయటపెట్టేశాడు. ఇది తెలిసిన పాకిస్తాన్ ఆర్మీ వెంటనే మన RAW ఏజెంట్ అయిన నబీ అహ్మెద్ షాకిర్ణి బందించింది.
అంతర్జాతీయా సదస్సులో పాక్ ప్రభుత్వం భారత ప్రభుత్వంపై దుమ్మెతి పోసింది. .అప్పటి భారత ప్రభుత్వం ఆ నబీ అహ్మెద్ షాకిర్ ఎవరో మాకు తెలీదు అంటూ తప్పించుకుంది. 16 ఏళ్లు కారాగారంలో పాక్ అధికారులు అతన్ని చిత్రా హింసాలకి గురి చేశారు, కానీ అతను ఏనాడూ భారత దేశ రహస్యాలని భయటపెట్టలేదు, తన భారతీయుడు అనే నిజాన్ని కూడా అంగీకరించలేదు ఎక్కడ మళ్ళీ దేశానికి మచ్చ అవుతుందో అని. అలా 16 ఏళ్ళు శవంలా బతికి ఆకరికి మరణించాడు. చివరికి తన భార్య పిల్లాడి ఆచూకీ కూడా తెల్సుకోలేకపోయాడు. అప్పటి భారత ప్రభుత్వం అతని శవం కూడా ముట్టలేదు. పాక్ ప్రభుత్వం అదే కారాగారంలో అతని శారీరాన్ని బూడిద చేసింది.
“మనం నడిచే నేల కింద ఒక్క అక్షరం కూడా రాయబడని ఎంతో మంది వీరుల మొండేలు తెగి పడి ఉన్నాయి, మనం పీల్చే గాలి చరిత్ర చెప్పుకొని చరిత్ర కారులా ఆస్తికుల సుగంధాన్ని ఆవహించుకుంది.గుర్తుపెట్టుకో నువ్వు నడిచేది ఆ వీరుల శవాలపై, నువ్వు పీల్చే గాలి ఆ వీరులు అమరత్వం.”
అలాంటి ఒక వీరుడే మన రవీంద్ర కౌశిక్, ముద్దుగా “Black Tiger” అని అంటాం.