శ్రీ మహావిష్ణువు శ్రీ జ్వాలా నరసింహస్వామిగా వేదాద్రిలో ఎలా వెలిసాడు

0
8138

శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపమే ఈ జ్వాలా నారసింహ అవతారం. మరి విష్ణుమూర్తి నరసింహా అవరం ఎందుకు ఎత్తాడు మరి ఆ ప్రదేశం పంచనారసింహ అని ఎందుకు పిలువబడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము.

jwaala narasimhaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేట మండలంలో చిలకల్లుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదీ తీరాన వేదాద్రి అనే గ్రామంలో పర్వత పాదభాగాన శ్రీ జ్వాలా నరసింహ క్షేత్రం కలదు. ఇది చాలా ప్రాచీన ఆలయము. ఇచ్చట నరసింహస్వామి పంచ రూపాత్మకుడై జ్వాలా సాలగ్రామ వీర యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారిగా సేవలందుకొనుచున్నాడు.

jwaala narasimhaస్థల పురాణం విషయానికి వస్తే, సోమకాసురుడు అనే రాక్షసుడు వేదములను దొంగలించి సముద్రంలో దాక్కొని ఉండగా అతనిని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుని సంహరించి వేదములను ఉద్దరించాడు. అప్పుడు వేదములు సంతోషించి శ్రీమహావిష్ణువుతో, దేవా! నీవు నేటి నుండి మా శిరములపై నధిరోహించి, మమ్ములను తరింపజేయమని కోరాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదముల కోరిక విని, చతుర్వేదములారా! నేను మునుముందు ప్రహ్లాదుని రక్షణార్థం ఉంగ్రనరసింహావతారమెత్తగలను అప్పుడు మీ కోరిక నెరవేర్చెదను అప్పటివరకు మీరు కృషవేణి నదీ గర్భాన సాలగ్రామరూపంలో ఉన్న నామీద విశ్రమించండి అని వేదములను సముదాయించాడట.

jwaala narasimhaకొంతకాలం తరువాత ప్రహ్లాదుని రక్షణార్థం శ్రీమహావిష్ణువు ఉగ్రనరసింహావతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించి తాను వేదములకిచ్చిన మాట ప్రకారం వేదములు ప్రతి ధ్వనించుచున్న వేదాద్రి శిఖరము మీద శ్రీమహావిష్ణువుని చూసి వేదాలంతో సంతోషించాయి. ఈ వేదాద్రి క్షేత్రంలో నరసింహావతారంలోని తన ఐదు అంశాలను వేదాద్రి అంతటా ఆవిర్భవింపజేశాడు.

jwaala narasimhaఈ విధంగా శ్రీమహావిష్ణువు కృష్ణవేణిలో సాలగ్రామ రూపంగాను, ప్రవతాగ్రము మీద శ్రీ జ్వాలా నరసింహరూపునిగా, పర్వత పాదభాగాన యోగానంద శ్రీ లక్ష్మీనరసింహరూపాలుగా, గరుడాద్రి మీద శ్రీ వీరనారసింహ రూపంతో వెలసినందు వల్లే ఈ క్షేత్రం పంచనారసింహం క్షేత్రముగా ప్రసిద్ధి గాంచినది.

5 Jwaala Narasimham Templeపశ్చిమాభిముఖంగా ఉన్న ఈ ఆలయంలో గర్భాలయం,అంతరాలయం,మండపం అను మూడు భాగాలుగా ఉన్నది. ఇక్కడి ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికీ ప్రతి సంవత్సరం వైశాఖశుద్ధ ఏకాదశి మొదలు పంచాహ్నికంగా తిరుకల్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది.

6 Jwaala Narasimham Templeఈ విధంగా శ్రీ మహావిష్ణువు శ్రీ జ్వాలా నరసింహస్వామిగా వేదాద్రిలో వెలిసాడు.