పాండవుల కారణంగా శివుడి శరీర భాగాలు పడిన ప్రదేశాలు ఎక్కడో తెలుసా?

0
8772

శివ పురాణం ప్రకారం పాండవుల కారణంగా శివుడి శరీర భాగాలు ఈ చోట్ల పడి పవిత్ర పుణ్యక్షేత్రాలుగా ఏర్పడ్డాయి. అయితే శివుడి శరీర భాగాలు పడిన ఆ పుణ్యక్షేత్రాలు ఏంటి? అవి ఎక్కడ ఉన్నాయి? పాండవుల కారణంగా పంచ కేదారాలు ఎందుకు వెలిశాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు బ్రహ్మ హత్యపాతకం పోవడం కోసం కాశీకి వెళ్లి శివుడి కోసం తపస్సు చేస్తారు. వారికీ దర్శనం ఇవ్వడం ఇష్టంలేని శివుడు కాశి నుండి ఉత్తర దిశకి నంది రూపంలో వెళ్ళిపోయాడు. అయితే గుప్త కాశీలో నంది రూపంలో ఉన్న శివుడు పాండవులకు కనిపించగా అప్పుడు భీముడూ ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించగా నంది రూపంలో ఉన్న శివుడు మాయం అయ్యడంటా. అప్పుడు శివుడి శరీర భాగాలు ఐదు చోట్ల పడిపోయాయి. అవే ఇప్పుడు పుణ్యక్షేత్రాలుగా భక్తుల పూజలు అందుకుంటున్నాయి. శివ పురాణంలో వర్ణించబడిన వీటినే పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు.

1. కేదారినాధ్:

Kedarnathద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాడవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లింగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈ లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. కాత్రిక మాసంలో వచ్చే యమద్వివిదియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీ కేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు.

2 . తుంగనాధ్:

Panchskenraluపంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఇది సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కేదారాని కంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారాల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది.

3. రుద్రనాధ్:

Panchskenraluపంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువన మోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్లవారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్. గోపేశ్వర్ నుండి 24 మైళ్ళు క్లిష్టమైన కొండ దారిలో కాలి నడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్ట తరమైనది గా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

4. మధ్య మహేశ్వర్:

Panchskenraluపంచ కేదారాలలో నాలుగవది మధ్య మహేశ్వర్. విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలూ ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి 11,470 అడుగులు. ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీ దేవిది, ఒకటి అర్ధ నారీశ్వరునిది. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడి వైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతా కాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

5. కల్పనాధ్:

Panchskenraluపంచ కేదారాలలో చివరిది కల్పనాధ్. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీకేశ్ బద్రీనాధ్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు. శివుని ఝటాఝూటం ఇక్కడ లింగ రూపంలో వెలసిందని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు. కోడలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలసిన ఈ స్వామిని ఝటేశ్వర్ అని భకులు పిలుస్తారు. అత్రి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయప్రాంగణంలో ఉన్న కల్పవృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి.
ఈ విధంగా శివుడి శరీర భాగాలు పడి పుణ్యక్షేత్రాలుగా వెలసిన ఈ పంచ కేదారాలు చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తుంటారు.