Veerabhadrudu LingaRoopamlo Darshanam Ichhe Pattisam

0
4413

వీరభద్రుడు భద్రకాళితో సహా లింగ రూపంలో ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. ఈ ఆలయంలో వీరభద్రుడు వీరేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. దేశంలో గల ఐదు ప్రఖ్యాత వీరభద్ర ఆలయాల్లో ఇది ఒకటి అని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. veerabhadruduఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం మండలం, పాత పట్టిసం గ్రామం సమీపంలో పవిత్ర గోదావరి నది మధ్యన ఎత్తైన కొండపైన శ్రీ భావన్నారాయణస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం రాజమండ్రికి సుమారు 50 కి.మీ. దూరంలో ఉంటుంది. దీనినే పట్టిసాచల క్షేత్రం గా పిలుస్తారు. veerabhadruduఈ కొండకి దక్షిణ భాగాన శ్రీ వీరేశ్వరస్వామి, ఉత్తరం వైపున శ్రీ భావన్నారాయణస్వామి వార్లు కొలువై ఉన్నారు. శ్రీ భావనారాయణస్వామి వారు కొలువై ఉన్న ప్రాంతమును నీలాచలంగా పిలుస్తారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి యొక్క ఆలయ గోపురం, మెట్లమార్గం దక్షిణముఖంగా ఉంటుంది. ఇచట ఉన్న శ్రీ వీరభద్రస్వామి లింగస్వరూపం తూర్పు ముఖంగా ఉంటుంది. veerabhadruduఇక శ్రీ వీరభద్రుడు చక్రాయుధాన్ని, భావనారాయణస్వామికి ప్రసాదించినట్లుగా స్థలపురాణం తెలియజేయుచున్నది. ఇక్కడ విశేషం ఏంటంటే, గోదావరి నది ఎంత వృద్ధుతంగా వచ్చిన నది గర్భంలో ఉన్న ఈ ఆలయం మాత్రం ఈనాటికి కూడా చెక్కుచెదరలేదు. veerabhadruduఈ ఆలయ స్థలపురాణం ప్రకారం, వీరభద్రుడు దక్షుడి శిరస్సుని ఖండించి తన ఆయుధం అయినా పట్టసాన్ని నేటి పట్టిసీమ ప్రాంతంలో గోదావరి నదిలో కడిగి ఆ కొండపై భద్రకాళి తో సహా లింగరూపంలో కొలువై అప్పటి నుండి పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం. veerabhadruduఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయంలో గల అరీశ్వరి, పురీశ్వరి దేవతలకి సంతానం లేని వారు విశేష పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.veerabhadrudu