మన హిందూసాంప్రదాయంలో ప్రతి పూజలోను వినాయకుడినే ముందుగా పూజిస్తారు. ఎందుకంటే అయన సకల దేవతాగణములకు అధిపతి. శివపార్వతుల కుమారుడైన వినాయకుడిని గణేషుడిని, విగ్నేశ్వరుడని, గణ నాయకుడు, గణపతి అంటూ అనేక రకాలుగా పిలుస్తారు. అయితే వినాయకుడిని ఏకాందంతుడు అని కూడా అంటారు. మరి వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకు అంటారు? తన ఒక దంతాన్ని ఎవరికీ సమర్పించాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గజముఖుడైన వినాయకుడికి పూర్వం రెండు దంతలుండేవి. పరశురాముడి వల్ల అతడు ఏకదంతుడయ్యాడు. అలా ఎందుకు జరిగిందనే పురాణ విషయానికి వస్తే, తండ్రి జమదగ్ని ని నిష్కారంగా చంపిన కార్త వీర్యార్జుడిని, ఇతర రాజులను హతమారుస్తానని తల్లి రేణుక వద్ద పరశురాముడు ప్రతిజ్ఞ చేస్తాడు. తన ప్రతిన నెరవేర్చుకోవడానికి శివుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకి మెచ్చి శివుడు పరశువును అంటే గొడ్డలిని పాశుపతాస్ర్తాన్ని ఇస్తాడు. అప్పుడు పరశురాముడు కార్త వీర్యార్జుడిని చంపి ఆ తరువాత 21 సార్లు రాజులపై దండెత్తి వారిని నిర్ములించి మరల తపస్సు చేసి శివుడి సందర్శనం కోసం కైలాసం వెళ్తాడు. ఆ సమయంలో ద్వారంలో గణపతి అడ్డుకొని పార్వతి పరమేశ్వరుల ఏకాంతాన్ని బంగపరచరాదన్నాడు. అప్పుడు పరశురాముడు తన పరశువుతో కొట్టబోగా గణేశుడికి కోపం వచ్చి తన తొండంతో పరశురాముడిని ముప్పు తిప్పలు పెట్టాడు. ఇంకా గోలోకం తీసుకువెళ్లి శ్రీ కృష్ణ దర్శం చేయించాడు. ఆ తరువాత పరశురాముని సేదతీర్చి, తన తండ్రి అతనికి వరప్రసాదంగా ఇచ్చిన పరశువును గౌరవించి దానికి తన రెండు దంతాలలో ఒకటి సమర్పించాడు. శివుడు అనుగ్రహించిన పరశువు వ్యర్థం గాకుండా గణపతి తన ఎడమ దంతాన్ని తీసి పరశురాముడు విసిరిన గండ్ర గొడ్డలికి సమర్పించి అప్పటి నుండి గణపతి ఏకదంతుడయ్యాడు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.