చెవుడు లేదా వినికిడి లోపం అనగా శబ్దాలను పూర్తిగా లేదా పాక్షికంగా వినలేకపోవడం. దీనికి చాలా విధాల జీవసంబంధ మరియు పర్యావరణ కారకాల వలన ఏర్పడుతుంది. అయితే ఈ వినికిడి లోపం ఏ వయసులోనైనా ప్రమాదమే. చాలామంది వినికిడి లోపమంటే అదేదో పెద్దల, మరీ ముఖ్యంగా వృద్ధుల సమస్యేననుకుంటారు. కానీ అది సరికాదు. వినికిడి లోపం పిల్లల్లోనూ, యుక్తవయస్కుల్లో కూడా తరచుగా కనబడుతూనే ఉంటుంది. పైగా ఆ చిన్నవయసులో వినికిడి లోపం వల్ల ఎదుగుదల తీవ్రంగా ప్రభావితమై, వారి ఉజ్జ్వలమైన భవిష్యత్తు అయోమయంగా కూడా తయారవుతుంది. అదృష్టవశాత్తూ చిన్నవయసులో తలెత్తే వినికిడి లోపాన్ని ముందుగా గుర్తిస్తే చక్కదిద్దేందుకు ఇప్పుడు అత్యాధునికమైన మార్గాలు చాలానే ఉన్నాయి.
వినికిడి లోపానికి కారణాలు:
కర్ణభేరిలో రంధ్రం వల్ల కర్ణభేరికి అనుసంధానంగా మధ్య చెవిలో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటంవల్ల చెవి నొప్పి, వినికిడి సమస్యలు తలెత్తుతాయి.
అంతర్ చెవిలోని శ్రవణనాడులు బలహీనపడటం, కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఈ నాడులు దెబ్బతినటం తదితర కారణాల వల్ల కూడా సమస్యలు వస్తాయి. మెదడులో వినికిడికి సంబంధించిన కేంద్రం దెబ్బతినటం వల్ల వినికిడి పైన ప్రభావం చూపిస్తుంది. వినికిడిలోపానికి కారణాలు ఏవైనా ప్రారంభ దశలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సమస్యను కొంత వరకూ తగ్గించుకోవచ్చు .
చెవులు మూసుకు పోయినప్పుడు. ముందు కంటే ఎక్కువగా వినపడుతుంటాయి. కాబట్టి సమస్య ఎక్కువ కాక ముందు వినికిడి లోపానికి ఒక చక్కటి పరిష్కార మార్గం ఉంది. అది వెల్లుల్లి మరియు మంచి నూనె లేదా ఆముదం అయితే ఇటువంటి హోం రెమెడీస్ ను ప్రయత్నించడానికి ముందు డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం.
అలాగే ఇంటర్నల్ ఇంజ్యురి (కర్ణబేరి సమస్యలు )ఉన్నప్పుడు, ఇయర్ ఇన్ఫెక్షన్, ఇతర చెవి సమస్యలున్నప్పుడు ఇటువంటి హోం రెమెడీస్ ను ఉపయోగించకూడదు. తాత్కాలికంగా చెవిలో నీళ్ళు, గుమిలి, ఇతర కారణాల వల్ల చెవి వినపడనప్పుడు మాత్రమే ఇలాంటి హోం రెమెడీస్ ఉపయోగించాలి.
చెవులు వినపడుట లేదని, ఇయర్ బడ్, పెన్సి, స్టిక్ లేదా ఇతర వస్తువులను చెవులో తిప్పడం వల్ల చెవులు మరింత డ్యామేజ్ అవుతాయి. స్నానం చేసినా కూడా చెవుల్లో తేమను కాటన్ క్లాత్ తో మాత్రమే తుడుచుకోవాలి.