శివుడు పార్వతీదేవికీ జీవిత రహస్యం వివరించిన ప్రదేశం

భారతదేశంలో ఉత్తరంవైపు వున్న అమరనాథ్ పర్వతాలలోని అమర్ నాథ్ గుహలు హిందువులకు ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం 5000 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆలయం. ఈ అమర్ నాథ్ గుహలోపల ఒక మంచు శివలింగంలా కనిపించే ఆకృతిని కలిగి వుంటుంది. ఇది వేసవి కాలమయిన మే నుండి ఆగస్టు వరకు పెరిగి ఆ తరువాత కరుగుతుంది.

అమర్ నాథ్ గుహపురాణాల ప్రకారం శివుడు తన భార్య అయిన పార్వతీదేవికీ జీవిత రహస్యం, సనాతనం గురించి ఇక్కడే వివరించారు.

స్థలపురాణం :

పూర్వం ఒకనాడు పార్వతీదేవి, ఈశ్వరుడితో ‘‘నాథా! మీరు కంఠంలో వేసుకునే ఆ పుర్రెమాలగురించి నాకు వినాలని వుంది’’ అని అడిగింది. అప్పుడు ఈశ్వరుడు… ‘‘పార్వతీ! నువ్వు జన్మించిన ప్రతిసారి నేను ఈ పుర్రెలమాలలో ఇంకొకటి అదనంగా చేర్చుకుని ధరిస్తుంటాను’’ అని బదులిచ్చాడు.

అమర్ నాథ్ గుహపార్వతీదేవి ‘‘నేనే మరణించి, తిరిగి జన్మిస్తూనే వుంటాను. కానీ నువ్వు మాత్రం అలాగే శాశ్వతంగా అమరుడిగా వుంటున్నావు. ఇదెలా సాధ్యం?’’ అని అడిగింది.

అమర్ నాథ్ గుహఈశ్వరుడు ‘‘పార్వతీ! ఇది ఎంతో రహస్యమైంది. కాబట్టి ఏ ఒక్క ప్రాణిలేని ప్రదేశంలో నీకు వివరంగా చెప్పాలి’’ అని చెప్పి ఏ ప్రాణజీవి లేని అమరనాథ్ గుహ ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. ఇలా ఈ విధంగా శివుడు పహల్ గాం వద్ద నందిని వుండమని ఉపదేశించి, చందన్ వారి వద్ద చంద్రుడిని వదిలివెళ్లాడు. అలాగే పాములను, గణేషుడిని, పంచభూతాలను ఆకాశంలో తమతమ ప్రదేశాలలో వదిలేసి ఈ అమరనాథ్ గుహలకు చేరుకున్నాడు.

అమర్ నాథ్ గుహఆ ప్రదేశంలో వున్న అన్యప్రాణులను ఇతర ప్రదేశాలకు పంపి, తన అమరత్వ రహస్యాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. అయితే అక్కడే పైనున్న ఒక పావురాల జంట గుడ్లరూపంలో ఈ అమరత్వ రహస్యాన్ని విని.. అవి కూడా అమరులు అయ్యాయని కథనం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR