వంటకు ఎలాంటి నూనె వాడితే మంచిది!

ఏ వంట చేయాలన్నా ముందుగా కావాల్సింది నూనె. నూనె లేకుండా వంట చేయలేం. చేసినా టేస్ట్ ఉండదు. వంటల్లో వాడే కంపల్సరీ ఇంగ్రెడియెంట్​గా నూనె మారిపోయింది. ఒకప్పుడు పండుగలు, పబ్బాలకు తప్ప మిగతా రోజుల్లో కిలో నూనె నెలంతా సరిపోయేది. ఇప్పుడు ఐదారు కిలోలు తెచ్చినా సరిపోవడంలేదు. కారణం ఇప్పుడు వాడేవన్నీ రిఫైన్డ్ నూనెలే.

oilఇలా ఎందుకంటే ఇప్పుడంతా ​. నూనె కూడా నీళ్లలా ఉంటున్నాయి. దీంతో కూరల్లో ఎంత నూనె పోసినా ఆ ఫ్లేవరే ఉండడం లేదు. ఒకప్పుడు అలాకాదు.. ఒక స్పూన్​ నూనె వేసి వంట చేసినా దాని ఫ్లేవర్​ బాగా తెలిసేది రుచి కోసం కాకుండా హెల్త్​ కోసం ఈ నూనెను వాడితే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. అసలు వంటకి ఏ నూనెనే వాడడం మంచిది? మంచి వంట నూనె అనేదే లేదు.

mustard oilఏ నూనే మన ఆరోగ్యానికి మంచిదని చెప్పలేం. ఒక్కో ప్రాంతం వారు ఒక్కో నూనె వాడుతున్నారు. ఉత్తరాదిన ఆవాల నూనె వాడుతున్నారు. సౌత్‌లో కొబ్బరి నూనె వాడతారు. ఇదే బెస్ట్ నూనె అనుకోవడం కరెక్టు కాదు. ప్రతీ నూనెలో ప్రత్యేక కొవ్వు, ప్రత్యేక లక్షణాలూ ఉంటాయి. ఇది మంచి నూనె, ఇది చెడ్డ నూనె అని అనుకోవడానికి వీల్లేదు. రెండు రకాల నూనెల్ని కలిపి వాడటం ఎప్పుడైనా మంచిదేనట.

coconut oilనిజానికి మోనోశాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (MUFA) ఉండే నూనెల్ని వాడాలి. ఎందుకంటే MUFA అనేది మంచి కొవ్వు. అలాగే… పాలీ అన్‌‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ – PUFA అనేవి ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి వుంటాయి. ఇవి మన బాడీకి చాలా అవసరం. మన శరీరం వాటిని స్వయంగా తయారుచేసుకోలేదు. వంట నూనె ద్వారానే అవి శరీరానికి అందుతాయి. అందుకే వేరువేరు నూనెల్ని కలిపి వాడుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్​ ఉంటాయి.

pufaకాంబినేషన్​ ఆయిల్స్​ విషయంలో కూడా కొంత అవేర్​నెస్​ అవసరం. ఎందుకంటే… సపోజ్ కొబ్బరి నూనెను వంటకు వాడుతుంటే… ఇక వేరే అవసరాలకు కొబ్బరినూనె వాడొద్దు. ఎందుకంటే కొబ్బరి నూనెలో ఫ్యాట్ ఎక్కువ. కొబ్బరి నూనెతో వంట చేసేవాళ్లు… రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె వాడొచ్చు. ఎందుకంటే PUFA అనేది కొబ్బరి నూనెలో ఉండదు. ఇక పల్లీనూనె వాడేవాళ్లు అందులో 25శాతం సన్​ఫ్లవర్​ ఆయిల్​ కలుపుకోవచ్చు. సన్​ఫ్లవర్​ ఆయిల్​తో వంట చేసేవాళ్లు అందులో నువ్వుల నూనె కాకుండా మరేదైనా ఆయిల్​ కలుపుకోవచ్చు.

rice branనూనెను వేడి చేసినప్పుడు వాటి టెంపరేచర్​ కూడా మారుతుంది. దీనిని స్మోకింగ్ పాయింట్ అంటారు. దీనిపై అవగాహన కలిగి ఉండాలి. అంతకు మించి వేడి చేయొద్దు. డబుల్​ రిఫైన్డ్​ ఆయిల్స్​ను ఎంత వేడి చేసినా వాటి నుంచి స్మోక్​ రాదు. అదే పల్లీ, సోయాబీన్​, సన్​ఫ్లవర్​ నూనెలను వేడిచేస్తే పొగలు వస్తాయి.
వంటనూనె‌‌ను ఎక్కువగా వేడి చేస్తే అందులో ఉండే విటమిన్–ఇ ఆవిరైపోతుంది. అంతేకాదు.. ఏ నూనెనైనా నాలుగుసార్ల కంటే ఎక్కువ వేడి చేసి వాడకూడదు.

చాలామంది పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ రెండూ ఒకటే అనుకుంటారు. పామ్​ ఆయిల్​ను పండు నుంచి తీస్తారు. పామ్​ కెర్నెల్​ ఆయిల్​ను గింజ నుంచి తీస్తారు. ఈ రెండూ ఒకేరకమైన గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే పామ్​ కెర్నెల్​ ఆయిల్​ను వాడకపోవడమే మంచిది. ప్రస్తుతం మార్కెట్లలో మిక్స్‌‌డ్ ఆయిల్స్ కూడా దొరుకుతున్నాయి. వాటిని డైరెక్టుగా వాడుకోవచ్చు. రకరకాల కాంబినేషన్​లతో ఉండే ఈ ఆయిల్స్​ను కూడా తరచూ మారుస్తుండాలి. మన హెల్త్​ కండీషన్​ను బట్టి ఈ ఆయిల్​ కాంబినేషన్​ను నిర్ణయించుకోవాలి.

palm oil

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR