సంతానం కలగలన్నా..మాంగళ్య దోషం పోవాలన్నా ఏ చెట్టుని పూజించాలి

వివాహ బంధం కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే పెళ్లి చేయడానికి ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు పెద్దలు. అలాగే… ఇద్దరి జాతకాలు కలిశాయో లేదో చూడటం కూడా.. అనాదిగా వస్తున్న ఆచారం. ఇద్దరి జాతకాలు కలిసిన తర్వాతే పెళ్లి విషయంలో ముందడుగు వేయడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.

అయితే కొంతమంది మాంగళ్య దోషం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. సంతానం కలగలన్నా..మాంగళ్య దోషం పోవాలన్నా.. అరటిచెట్టుని పూజించాలి..! సీతారాములు కూడా అరటి పూజ చేశారని ప్రతీతి.

1-Rahasyavaani-1093దేవతలు కొలువుండే వృక్షాలతో అరటి చెట్టు కూడా ఒకటి. అరటి చెట్టును పూజించడం ద్వారా విశిష్ట ఫలాలు లభిస్తాయి. ఒక మంచి రోజు చూసుకుని.. ఉదయాన్నే లేచి.. తలస్నానం చేసి.. పెరటిలో ఉన్న అరటి చెట్టు ముందుగా తెచ్చి పెట్టుకున్న అరటి పిలకను గానీ పూజా మందిరంలో ఉంచి పూజిస్తే సంతానం కలుగుతుందని పండితులు చెప్తున్నారు.

2-Rahasyavaani-1093అరటికాండానికి పసుపు కుంకుమలతో, పుష్పాలతో చక్కగా అలంకరించి.. దీపారాధన చేయడం ద్వారా సంతానం ప్రాప్తిస్తుంది. దీపారాధనకు అనంతరం పెసరపప్పు, బెల్లం, తులసీదళాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి.

మధ్యాహ్నం పూట ఐదుగురు ముత్తయిదువులకు భోజనం పెట్టి.. వారికి దక్షిణ తాంబూలాదులు, ఐదేసి అరటి పండ్లను వాయనంగా ఇవ్వాలి. ఈ పూజ చేసేవారు సాయంత్రం చంద్రుని దర్శించుకున్న తర్వాతే భోజనం చేయాలి.

3-Rahasyavaani-1093అరటి పూజను సీతారాములు కూడా చేశారని విశ్వాసం. ఈ పూజను చేసినవారికి సంతానం కలగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయట. ముఖ్యంగా అత్తింటి కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.

అరటి చెట్టును గురువు ప్రతీకగా భావిస్తారు. దేవ గురువు అయిన బృహస్పతికి అరటి చెట్టు సమానం అంటారు. అలాగే విష్ణువుకు కూడా అరటి చెట్టు ప్రీతికరమని.. గురువారం పూట అరటి చెట్టును పూజించే వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

ఇంకా జ్యోతిష్య ప్రకారం అరటిచెట్టు మాంగల్య దోషాలను నివృత్తి చేస్తుంది. తద్వారా సంవత్సరాల పాటు సంతానం కలగని దంపతులకు.. అరటి పూజ ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR