పాండవులు పంచకేదార్ శివలింగ క్షేత్రాలను ఎందుకు నిర్మించారు?

హిందూ సంస్కృతిలో పరమేశ్వరున్ని లింగ రూపంలో భక్తులు పూజిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. హిమాలయాల్లో కైలాసం ఉందని అక్కడ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడని కొంతమంది ఋషులు చెప్పడం కూడా జరిగింది. అంతే కాదు హిమాలయ పర్వతాలలో ఉన్న పంచకేదార్ శివలింగ క్షేత్రాలు శివలింగ క్షేత్రాలలో ప్రశస్తమైనవి. ఈ పంచ కేదార్ క్షేత్రాలు కేదారేశ్వర్ నుండి బదరీనాధ్ వరకు విస్తరించి ఉన్నాయి.

పంచకేదార్ శివలింగ క్షేత్రాలఅందులో మనందిరికి ఎక్కువగా పరిచయం ఉన్న కేధారేశ్వర్ క్షేత్రం మొదటిది 2. మధ్యమహేశ్వర్ 3. తుంగనాధ్ 4. రుద్రనాధ్ 5. కల్పెశ్వర్.

హిమాలయాల హిల్ స్టేషన్స్ వల్ల అక్కడికి వాహనాలు వెళ్లే దారి ఉండదు. ఇక్కడి యాత్రా స్థలాలు కాలినడకనే వెళ్ళవలసి ఉంటుంది. సహజంగా కాలినడకన ఎక్కడికైనా వెళితే అలసిపోతాం. కానీ శారీరక అలసట తెలియకుండా ఉండేందుకు అన్నట్లు అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నడవలేని వారి కోసం గుఱ్ఱాలు , డోలీలు దొరుకుతాయి. చాలా చోట్ల చాలా ఎత్తు (స్టీప్) ఎక్కవలసి రావడంతో కాస్త ఆయాసం ఎక్కువగా అనిపిస్తుంది.

పంచకేదార్ శివలింగ క్షేత్రాలశివుడు నంది (ఎద్దు) రూపంలో అదృశ్యమై అయిదు భాగములుగా మూపుర భాగం కేదారేశ్వర్ లో, నాభి మరియు ఉదర భాగం మధ్యమహేశ్వర్ లోనూ, చేతులు తుంగనాధ్ లోనూ, ముఖము రుద్రనాధ్ లోనూ, తల మరియు కురులు కల్పెశ్వర్ లో వ్యాప్తి చెందినవి. పురాణముల ప్రకారం ఈ ఎద్దు (నంది) ముందు భాగము నేపాల్ లోని పశుపతినాధునిగా దర్శనం ఇచ్చాడు.

నంది కొమ్ములుపశుపతినాధ్ దేవాలయం నుండి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. కేదార్నాథ్ చిహ్నం పశుపతినాధ్ ఆలయగోపురము లో దర్శనమిస్తుంది. పంచకేదార్ లలో శివ దర్శనం అయి యాత్ర పూర్తి అయిన పిమ్మట చివరిగా విష్ణు భగవానుడు వెలసిన బదరీనాధ్ ను దర్శించి అక్కడ కూడా శివుని దీవెనలు పొందవలసి ఉంటుంది.

పంచకేదార్ శివలింగ క్షేత్రాలతుంగనాధ్ లో తప్ప మిగిలిన క్షేత్రాలలో పూజారులు దక్షిణ భారత దేశం నుండి వలస వెళ్లిన వారే. బదరీనాధ్ ఆలయంలో పూజారులు కేరళ రాష్ట్రంలోని మలబార్ నుండి వలస వెళ్ళినవారు. మధ్య మహేశ్వర్ ఆలయ పూజారులు జంగమ లేదా వీర శైవ లింగాయుతులు. రుద్రనాథ్ లో మరియు కల్పేశ్వర్ ఆలయంలో ఆది శంకరాచార్యులచే నియమించ బడిన దాసనమీ గోసన కులస్థులు పూజా కార్యక్రమములు నిర్వహిస్తున్నారు. తుంగనాధ్ లో కాశీ బ్రహ్మలు సేవ చేస్తారు.

పంచకేదార్ శివలింగ క్షేత్రాలకేదారనాధ్ తీర్థంలో పురోహితులు లేదా పండాలు హిమాలయ ప్రాంతంలో పూర్వకాలం నుండి అనగా కృత యుగం చివర నుండి ప్రస్తుత కలియుగ ప్రారంభం వరకు ఉన్నటువంటి బ్రాహ్మణులు. పాండవులు మోక్షం పొందడానికి మహాప్రస్థానానికి వెళ్లినప్పుడు వారి ముని మనుమడు అయిన జనమేజయుడు కేదారనాధ్ వచ్చి ఆలయంలో పూజాధికాలు నిర్వర్తించే అధికారం ఈ బ్రాహ్మణ కుటుంబీకులకు ఇచ్చినట్లు ఈ ప్రాంత వాసులు తెలుపుతారు. ఈ ఆలయ పూజారులు గుప్తాక్షి లో నివాసం ఉంటారు.

పంచకేదార్ శివలింగ క్షేత్రాలయాత్రకు వెళ్లాలని అనుకునేవారు యాత్ర ప్రారంభానికి 6 నెలల ముందు నుండి రోజు నడవడం అలవాటు చేసుకోవాలి. స్థానిక స్థల పురాణం ప్రకారం మహాభారత కాలంలో పాండవులు తమ దాయాదులు అయిన కౌరవులను కురుక్షేత్ర సంగ్రామంలో ఓడించి చంపేశారు. పాండవులు యుద్ధంలో చేసిన పాపాలు గోత్రీకుల హత్య మరియు గో హత్యలు. వాటి నుండి విముక్తి కావడానికి తమ రాజ్య భారాన్ని తమ వంశీకులకు అప్పగించి శివుని వెతికి పాపపరిహారం పొందాలని వెతుకుతూ బయలుదేరారు. శివునికి ప్రీతి పాత్రమైన వారణాశి పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో వారివల్ల కలిగిన ప్రాణనష్టానికి శివుడు కోపగించి వారి ప్రార్థనలను వినిపించుకోకుండా వారి నుండి తప్పించు కోవాలని అనుకోని ఎద్దు (నంది) రూపాన్ని ధరించి హిమాలయ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు.

వారణాశివారణాశిలో శివుని కనిపెట్టలేక పాండవులు హిమాలయాలకు వెళ్లారు. భీముడు రెండు పర్వతాల మధ్య నిలబడి చూడగా నంది రూపంలో శివుడు గుప్తాక్షి వద్ద గడ్డి మేస్తూ కనిపించాడు. భీముడు నంది తోక పట్టుకొని ఆపడానికి ప్రయత్నించగా అక్కడి నుండి అదృశ్యమై తరువాత ప్రత్యక్షమై ఐదు భాగాలుగా విడిపోయాడు. మూపుర భాగం కేదార్నాథ్, చేతులు తుంగనాధ్, బొడ్డు మరియు ఉదర భాగం మధ్య మహేశ్వర్, ముఖ భాగం రుద్రనాథ్ మరియు తల మరియు జుట్టు కల్పేశ్వర్ లో పడినవి.

పంచకేదార్ శివలింగ క్షేత్రాలపాండవులు శివుని ప్రార్ధించడానికి గాను ఈ అయిదు స్థలాలలో ఆలయాలు నిర్మించి వారి పాపాల నుండి విముక్తి పొందారు. శివుని ముందు భాగం పడిన ప్రదేశంలో నేపాల్ లోని ధోలేశ్వర్ ఆలయం ఉంది అని చెపుతారు. పాండవులు ఈ పంచకేదార్ ఆలయాలు నిర్మించిన తరువాత కేదార్నాధ్ లో తపస్సు చేసి యజ్ఞం చేసి స్వర్గలోకాన్ని పొందారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR