వెండి పట్టీలే ఎందుకు???

కళ్లకు కాటుక, నుదిటిన బొట్టు, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు… ఇవన్నీ అమ్మాయిల అందాన్ని మరింత పెంచేవి. మహిళలకు మరింత అందాన్ని తీసుకొచ్చేవి ఆమె వేసుకునే ఆభరణాలు. భారతీయ సాంప్రదాయంలో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి రకరకాల ఆభరణాలతో అలంకరించి ముచ్చటగా చూసుకుంటారు తల్లిదండ్రులు. కాలి పట్టీల నుంచి పాపిటబిళ్ల వరకు.. అమ్మాయికి అలంకరించాలే గానీ.. ఒళ్లంతా బంగారమైపోవాల్సిందే.

jewelleryఅయితే మహిళలు తమ పాదాలకు పట్టీలు ధరించడం అనేది మన హిందూ సాంప్రదాయాలలో ఒక ఆచారంగా వస్తోంది. ఈ క్రమంలోనే ఒక మహిళకు పెళ్లి అయిన తర్వాత కాళ్ళకు పట్టీలు, కాలి వేళ్ళకు మెట్టెలు తొడుగుతుంటారు.

silver ankletsఅదేవిధంగా పాప పుట్టినప్పటినుంచి తన కాళ్లకు పట్టీలు తొడిగి ఇంటిలో మువ్వల సవ్వడి చేస్తూ తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వెండి పట్టీలని తొడుగుతారు. ఈ వెండి మువ్వలు ధరించి ఆడపిల్ల ఇంట్లో తిరిగితే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటిలో నడుస్తున్నట్టు భావిస్తారు.

ప్రస్తుత ప్రపంచంలో ఫ్యాషన్ ఒక భాగమైపోయింది.
ఈ క్రమంలోనే పాదాలకు వెండి పట్టీలకు బదులు వివిధ రకాల డిజైన్లతో తయారైన పూసలు వంటి పట్టీలను కూడా ధరిస్తున్నారు. మరికొందరు సంపన్నులు ఏకంగా బంగారు పట్టీలు కూడా పాదాలకు తొడుగుతున్నారు.

gold ankletsఅయితే ఎన్ని రకాలు పట్టీలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం వెండి పట్టీలు మాత్రమే మహిళలు
ధరించాలని పండితులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో మహిళలు చాలా మంది బంగారు పట్టీలు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నిజానికి బంగారు పట్టీలు ఎట్టి పరిస్థితులలో కూడా పాదాలకు తొడగకూడదని పండితులు చెబుతున్నారు.

మన హిందూ పురాణాల ప్రకారం బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు వర్ణంలోనే బంగారం కూడా ఉంటుంది.
మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన బంగారంతో పట్టీలు చేయించుకొని పాదాలకు తొలగడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమాన పరిచినట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇక సైన్స్ పరంగా కూడా పాదాలకు వెండి పట్టీల తొడగటం వల్ల మన శరీరంలో ఉన్న వేడిని బయటకు తొలగించడానికి వెండి దోహదపడుతుంది.

money and lakshmi deviఈ క్రమంలోనే మన శరీరంలో బలం అనేది కింద నుంచి పైకి పాకుతుంది కాబట్టి మన పాదాలు చల్లగా ఉంటే శరీరం మొత్తం చల్లబడుతుంది. అందుకోసమే పాదాలకు కేవలం వెండి పట్టీలు మాత్రమే ధరించడం ఎంతో మంచిదని అటు ఆరోగ్య పరంగాను ఇటు ఆధ్యాత్మికపరంగాను వెండి మేలును కలుగజేస్తుందని పండితులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR