పార్వతి యొక్క కుమారుడు వినాయకుడు. దేవతలందరికి అధిపతి అని వినాయకుడిని అంటారు. ఎలుకని వాహనం చేసుకున్న గణపయ్యకు దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. అయితే ఎన్నో గొప్ప ఆలయాలు ఉన్నపటికీ ఈ ఆలయానికి ఒక విశేషం ఉంది. గర్భగుడిలో ఉండే వినాయకుడి విగ్రహం రోజు రోజుకి పెరుగుతూ గర్భగుడి పై భాగం తాకుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.కేరళ రాష్ట్రంలోని కాలికట్ కు దగ్గరలో కాసారగాడ్ అనే ఊరిలో మహా గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని మధురాలయం అని అంటారు. ఈ ఆలయంలో వినాయకుడు స్వయంభూగా వెలిశాడని ప్రసిద్ధి. మధురవాహిని నదీ తీరంలో, ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుండటంతో మధూరు నిత్యం దైవ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో నిండివుంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం పరమేశ్వరుడు. ఈ క్షేత్రంలో మదరాంతేశ్వర స్వామిగా ఆయన పూజలందుకుంటున్నారు.పురాణానికి వస్తే, ఒక మహిళ స్వామివారి విగ్రహాన్ని కనుగొంది. అందుకనే స్వామివారిని ఉద్భవమూర్తిగా పేర్కొంటారు. తొలిసారిగా మహిళా భక్తురాలికి స్వామివారు దర్శనమిచ్చారు. అందుకనే ఆమె పేరుపై మధూరు ఆలయంగా ప్రసిద్ధి చెందింది. స్వామి గర్భగుడి వెలుపల దక్షిణ భాగం గోడపై వినాయకుడి విగ్రహం ఉంటుంది. రోజురోజుకూ స్వామివారు పెరుగుతుండటం విశేషం. అందుకనే బొడ్డ గణేశా అని పిలుస్తుంటారు. ప్రధాన దైవం ఈశ్వరుడు అయినా గణనాథునికి విశేషపూజలు నిర్వహించడం క్షేత్ర ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది.ఒక కథనం ప్రకారం టిప్పుసుల్తాన్ ఆధ్వర్యంలోని సేనలు మలబార్‌పై దండెత్తాయి. ఈ క్రమంలోనే ఆలయంపైకి సేనలు వచ్చాయి. ఆలయ ప్రాంగణంలోని బావిలోని నీటిని టిప్పుసుల్తాన్ తాగిన తరువాత మనస్సు మారి దాడిని విరమించుకొని వెనక్కు మళ్లినట్టు తెలుస్తోంది.ఆలయాన్ని ఏనుగు ఆకారంలో నిర్మించారు. మూడు అంతస్తులుగా ఉండే ఆలయం సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది.ఈ ఆలయంలో కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్ని ప్రసాదంగా ఇస్తారు. మహాగణపతికి ఉదయాస్తమానసేవ నిర్వహిస్తారు. ఇంకా సహస్ర అప్ప పూజలో భాగంగా వెయ్యి అప్పాలతో పూజలు జరిపిస్తారు. మరో ముఖ్యమైన సేవ మూడప్పమ్. ఇందులోనూ అప్పాలతో పూజ జరిపించడం విశేషం. ఇక్కడ వినాయక చవితికి భారీ స్థాయిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఇలా ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన ఈ ఆలయంలోని వినాయకుడు రోజు రోజుకి ఎత్తు పెరగడం భక్తులని ఆశ్చర్యానికి గురి చేస్తూ విశేషంగా ఆకట్టుకుంటుంది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.