శ్రీ మహావిష్ణువు దశావతారాలలో పరశురాముడి అవతారం ఒకటని పురాణాలు చెబుతున్నాయి. అధికార బలంతో విర్రవీగే క్షత్రియులను వధించే అవతారమే పరశురామావతారం అని చెబుతారు. అయితే అలా క్షత్రియులని తన గండ్ర గొడ్డలితో వధించిన పరశురాముడు పాప పరిహారార్థం తపస్సు చేసిన ప్రాంతంగా ఈ ఆలయాన్ని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అస్సాం రాష్ట్రం, జోర్ హాట్ జిల్లా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో శివ సాగర్ సరస్సు ప్రక్కన శివడాల్ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయమని చెబుతారు. ఇక్కడ వెలసిన శివుడిని భక్తులు శివడాల్ స్వామి అని పిలుస్తారు. ఇక పూర్వం పరశురాముడు రాజులనబడే వారినందరిని 21 మార్లు వెంటాడి వధించి తన గండ్రగొడ్డలి వదిలిపెట్టి తన పాప పరిహారార్థం ఇక్కడే తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పరశురామ కుండం కూడా ఉన్నదీ. ఇంకా ఇక్కడ నేలబారు క్రిందుగా మూడు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు రెండు అంతస్థులతో గుండ్రని ఆకారపు ఆలయాలుగా నిర్మించబడినవి. ఈ శివసాగర్ లోని శివాలయం ఊరి మధ్యలోనే ఉంది. ఇది చాలా పెద్ద ప్రాంగణంగా చెబుతారు. ఇక్కడ ఉన్న మూడు ఆలయాలు ఒకదాని పక్కనే మరొకటి ఉన్నాయి. ఇక శివసాగర్ అంటే శివసముద్రమని అర్ధం. ఇక ఈ మూడు ఆలయాలు కూడా బంగారపు డోములతో నిర్మించబడ్డాయి. ఈ మూడు ఆలయాలకు మధ్యలో శివాలయం ఉంది. దీనినే ప్రధానమైన ఆలయమని చెబుతారు. ఈ ఆలయాన్ని అనుకొనే ఒక పెద్ద సరస్సు ఉంది. శివాలయం పక్కన ఈ సరస్సు ఉండటం వలన దీనిని శివసాగర్ అని పిలుస్తారు. ఈ ఆలయ శిఖర భాగం ఒక విచిత్ర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. శివాలయంలో విశేషం ఏంటంటే, గర్భగృహం మధ్యలో ఒక చిన్న గుంట ఉంది. ఈ గుంట అడుగుబాగానే సుమారు నాలుగు అంగుళాల శివలింగం ఉంది. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎప్పుడు అధికంగా ఉంటుంది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.