రాత్రి సమయాలలో అమ్మవారు గుర్రం పైన పర్యటిస్తూ భక్తులని రక్షిస్తుందని భక్తుల నమ్మే ఆలయం తెలుసా ?

0
10069

మజ్జిగౌరమ్మ తల్లి వెలసిన ఈ ఆలయంలో ఎన్నో ఆచారాలు నమ్మకాలు అనేవి ఉన్నాయి. ఈ ఆలయానికి ఒకసారి వచ్చిన భక్తులు తిరిగి మళ్ళీ మళ్ళీ ఈ ఆలయంలో ఆ తల్లి దర్శనానికి వస్తుంటారు. ఎందుకంటే ఈ తల్లి భక్తుల కోరికలు నెరవేరుస్తూ భక్తులని చల్లగా చూస్తుంది. మరి ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

majjigourammaఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో మజ్జిగౌరమ్మ తల్లి ఆలయం ఉంది. అయితే ఒక కోటలో మధ్యలో అమ్మవారు వెలిశారని స్థల పురాణం అందుకే ఈ ఆలయానికి మజ్జి గౌరమ్మ అనే పేరు వచ్చినది అని చెబుతారు. ఈ ఆలయాన్ని మొదట్లో మజ్జిగరియాణి అని పిలిచేవారు. అంటే మధ్య గదిలో వెలసిన అమ్మవారు అని అర్ధం. అయితే ఇక్కడ తెలుగు సంప్రదాయాలు కూడా ఎక్కువ ఉండటం వలన మజ్జిగరియాణి అమ్మవారు మజ్జిగౌరమ్మతల్లి అని కూడా పిలువబడుతుంది.

majjigourammaఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ సింహద్వారం దాటగానే ఒక వెండి గుర్రం అందరిని ఆకట్టుకుంటుంది. రంకెలేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించే ఈ గుర్రాన్ని ఐదు క్వింటాళ్ల ఇత్తడితో తయారుచేసారు. అయితే రాత్రి సమయాలలో అమ్మవారు ఈ గుర్రం పైన పట్టణం చుట్టూ పర్యటిస్తూ భక్తులని రక్షిస్తుందని భక్తుల నమ్మకం.

majjigourammaఇంకా ఈ ఆలయంలో ఉన్న ఒక వింత ఆచారం ఏంటంటే, అక్కడ ఉన్న రాయజానీ మందిరం వద్ద భక్తులు రాళ్ల పూజ చేస్తారు. అయితే ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు ఈ రాయజానీ మందిరం వద్దకి వచ్చి ఒక్కొక్కరు ఒక రాయిని వేస్తారు. ఇలా వేసిన రాళ్ళని ప్రతి సంవత్సరం విజయదశమి తరువాత దగ్గరలో ఉన్న ఒక లోయలో వేస్తారు.

majjigourammaఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, పదిహేనో శతాబ్దంలో నందపూర్ మహరాజ్ రాజా విశ్వనాథ్‌దేవ్ రాయగడలో ఓ కోట నిర్మించుకొని పాలనా కొనసాగిస్తుండేవాడు. అయితే ఆయ‌న దుర్గా మాత కి పరమ భక్తుడు. ఈ రాజుకి 108 మంది రాణులు ఉండేవారు. ఇది ఇలా ఉంటె ఆ రాజు దుర్గామాత పైన ఉన్న భక్తితో తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేస్తుండేవాడు. ఇక గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్‌షా సేనాధిపతి రుతుఫ్‌ఖాన్ రాయగడపై దండెత్తి విశ్వనాథ్ దేవ్‌ని సంహరిస్తాడు. రాజు మరణ వార్త తెలిసిన ఆ 108 మంది రాణులు ఆ కోటలోనే ఆత్మహుతి చేసుకుంటారు.

majjigourammaఆ తరువాత కాలంలో బ్రిటీష్ వారు విజయనగరం నుండి రాయగడ ప్రాంతానికి రైలు మార్గం నిర్మించేందుకు ఈ ఆలయం ఉన్న జంఝావతి నది పైన కొంత దూరం వంతెన నిర్మించగా ఒక రోజు ఆ వంతెన కూలిపోయింది. అదేరోజు ఆ బ్రిటిష్ అధికారి కలలో అమ్మవారు కనిపించి తనకి ఒక ఆలయాన్ని నిర్మించమని అప్పుడు వంతెనకు ఎలాంటి ఆటంకం కలుగదని చెప్పడంతో ఆ అధికారి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.

6 korina korkelu thirche majjigouramma thalliఇలా ఇక్కడ వెలసిన ఈ తల్లి ని దర్శించుకోవడానికి ఉత్త‌రాంధ్ర‌, ఒడిస్సా వాసులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

7 korina korkelu thirche majjigouramma thalli